E-Paper
Advertisement

చెవులకు క్లిప్ పెట్టేసుకోవడమే! శాంసంగ్ నుంచి ఓపెన్ ఇయర్ ఇయర్‌బడ్స్

చెవులకు క్లిప్ పెట్టేసుకోవడమే! శాంసంగ్ నుంచి ఓపెన్ ఇయర్ ఇయర్‌బడ్స్
Advertisement

Samsung Galaxy Buds Able: మ్యూజిక్ లవర్స్‌కు శాంసంగ్ కంపెనీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నార్మల్ ఇయర్‌బడ్స్‌ను ఎక్కువసేపు చెవుల్లో పెట్టుకుంటే నొప్పి పుట్టడం, చెమట పట్టడం లాంటి సమస్యలు వస్తుంటాయి కదా? అందుకే వీటన్నింటికీ చెక్ పెడుతూ.. శాంసంగ్ సరికొత్త క్లిప్-ఆన్ ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ ‘గెలాక్సీ బడ్స్ ఏబుల్’ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సరికొత్త గ్యాడ్జెట్ విశేషాలు, అసలు దీని వల్ల యూజర్లకు వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

అసలు ఏంటి ఈ క్లిప్-ఆన్ ఓపెన్-ఇయర్ డిజైన్?

Advertisement

సాధారణంగా మనం వాడే ఇయర్‌బడ్స్ చెవి లోపలి భాగంలోకి వెళ్తాయి. కానీ.. ఈ కొత్త గెలాక్సీ బడ్స్ ఏబుల్ డిజైన్ పూర్తిగా డిఫరెంట్. ఇది చెవి రంధ్రంలోకి వెళ్లకుండా, చెవి పక్క భాగంలో ఒక చిన్న ‘క్లిప్’ లాగా తగిలించుకునేలా ఉంటుంది.

ఎయిర్ కండక్షన్ టెక్నాలజీ: చాలామంది ఇవి బోన్ కండక్షన్ (ఎముకల ప్రకంపనల ద్వారా వినపడటం) అనుకుంటారు. కానీ శాంసంగ్ ఇందులో పవర్‌ఫుల్ ఎయిర్ కండక్షన్ టెక్నాలజీని వాడుతోంది. అంటే సౌండ్ నేరుగా గాలి ద్వారా చెవిలోకి ప్రసరిస్తుంది.

Advertisement

నో ఇయర్ పెయిన్: ఇవి చెవి రంధ్రాన్ని పూర్తిగా మూసేయవు . కాబట్టి ఎంతసేపు వాడుకున్నా సరే చెవి నొప్పి అస్సలు రాదు.

చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఈజీగా తెలిసిపోతుంది!
రోడ్లపై నడిచేటప్పుడు లేదా ట్రాఫిక్‌లో వెళ్లేటప్పుడు నార్మల్ ఇయర్‌బడ్స్ పెట్టుకుంటే వెనక నుంచి వచ్చే హారన్లు లేదా ఎవరైనా పిలిచే పిలుపులు అస్సలు వినిపించవు. దీని వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. కానీ ఈ గెలాక్సీ బడ్స్ ఏబుల్‌తో ఆ టెన్షన్ లేదు. మీరు హ్యాపీగా సాంగ్స్ వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. అదే సమయంలో చుట్టుపక్కల ఉండే శబ్దాలను కూడా క్లియర్ గా గమనించవచ్చు. ముఖ్యంగా రన్నింగ్, వాకింగ్ చేసేవారికి, ఆఫీసుల్లో పని చేస్తూ కొలీగ్స్ మాటలు వినాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.

గూగుల్ వన్ యూఐ యాప్‌లో.. లీకైన లుక్!
శాంసంగ్ అధికారికంగా ప్రకటించకముందే.. వారి సాఫ్ట్‌వేర్ ఫర్మ్‌వేర్ ఐకాన్స్‌లో ఈ డిజైన్ లీకైంది. మోడల్ నంబర్ SM-U600 తో వస్తున్న ఈ డివైజ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, రెండు చిన్న డోమ్ ఆకారపు యూనిట్లతో కూడిన క్లిప్ మెకానిజమ్‌తో కనిపిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న బోస్ అల్ట్రా ఓపెన్, సోనీ లింక్‌బడ్స్ క్లిప్, హువావే ఫ్రీక్లిప్ వంటి ప్రీమియం బడ్స్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: ఊహించని ధరల్లోనే.. డబుల్ డోర్ ఫ్రిజ్‌లు, ఇంకెందుకు ఆలస్యం

బ్యాటరీ ,కనెక్టివిటీ అప్‌డేట్స్:
ఇండియాకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కూడా దీని బ్యాటరీ కాంపోనెంట్ కనిపించింది. అంటే త్వరలోనే.. ఇది ఇండియాలో కూడా లాంచ్ కానుందని స్పష్టమవుతోంది. గెలాక్సీ ఎకోసిస్టమ్‌తో ఇది చాలా ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతుంది. అలాగే శాంసంగ్ లేటెస్ట్ ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

గతంలో శాంసంగ్ ‘బీన్’ షేప్‌లో గెలాక్సీ బడ్స్ లైవ్ తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి తీసుకురాబోతున్న క్లిప్-ఆన్ మోడల్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది. లీక్స్ ప్రకారం.. రాబోయే శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లేదా ఈ ఏడాది చివర్లో కొత్త ఫోల్డబుల్ ఫోన్లతో పాటు ఈ గెలాక్సీ బడ్స్ ఏబుల్ అధికారికంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇయర్ హైజీన్ (చెవి ఆరోగ్యం), కంఫర్ట్‌ను కోరుకునే వారికి ఇదొక బెస్ట్ ఛాయిస్ కానుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×