E-Paper
Advertisement

Samsung Galaxy Buds 4 Pro: వర్త్ వర్మా వర్త్.. శాంసంగ్ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ AI ఇయర్‌బడ్స్ వచ్చేశాయ్!

Samsung Galaxy Buds 4 Pro: వర్త్ వర్మా వర్త్.. శాంసంగ్ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ AI ఇయర్‌బడ్స్ వచ్చేశాయ్!
Advertisement

Samsung Galaxy Buds 4 Pro: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన సరికొత్త Galaxy Buds 4 సిరీస్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. Galaxy S26 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు వచ్చిన ఈ ఇయర్‌బడ్స్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం గెలాక్సీ బడ్స్ 4, బడ్స్ 4 ప్రో మోడల్స్ ప్రీ ఆర్డర్ల అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం రండి పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

కొత్తగా బ్లేడ్ డిజైన్:

ఈసారి శాంసంగ్ తన ఇయర్‌బడ్స్ డిజైన్‌లో విప్లవాత్మక మార్పులు చేసింది. తమ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్లేడ్ డిజైన్ అనే సరికొత్త రూపాన్ని వీటికి ఇచ్చింది. ఇది చెవిలో చాలా సౌకర్యవంతంగా కూర్చుంటుంది. బడ్స్ 4 ప్రో మోడల్ చెవి లోపలికి వెళ్లే కెనాల్ ఫిట్ డిజైన్‌తో ఉంటే.. బడ్స్ 4 మాత్రం ఓపెన్ ఫిట్ డిజైన్‌తో లభిస్తుంది. మెటల్ ఫినిషింగ్‌తో ఉన్న వీటిని సులభంగా ఆపరేట్ చేయడానికి ప్రత్యేకమైన పించ్ కంట్రోల్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

Also Read: మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా? ఆ ఒక్క యాప్ చేసే పనే ఇదంతా!

మెరుగైన ఆడియో అనుభవం:

ఈ గెలాక్సీ బడ్స్ 4 ప్రోలో సరికొత్త హార్డ్‌వేర్ అప్‌డేట్స్ ఇచ్చారు. ఇందులో అమర్చిన పెద్ద సైజు వూఫర్ వల్ల బేస్ చాలా క్లియర్‌గా వస్తుంది. 24 బిట్ హైఫై ఆడియో సపోర్ట్ వల్ల ఒరిజినల్ రికార్డింగ్‌లో ఉండే ప్రతి చిన్న సౌండ్‌ను కూడా స్పష్టంగా వినొచ్చు. వయొలిన్ నుంచి డబుల్ బేస్ వరకు ప్రతీ సౌండ్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది.

స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్:

Advertisement

బయట ఉండే అనవసరమైన శబ్దాలను తగ్గించడానికి దీనిలో అడ్వాన్స్‌డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను వాడారు. దీంతో ప్రయాణాల్లో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. పరిస్థితిని బట్టి ఈ ఇయర్‌బడ్స్ ఆటోమేటిక్‌గా సౌండ్‌ను అడ్జస్ట్ చేస్తాయి. తద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తికి మన వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది.

ధర వివరాలు:

ఈ బడ్స్ ద్వారా నేరుగా గూగుల్ జెమిని, బిక్స్ బి వంటి ఏఐ అసిస్టెంట్లను వాయిస్ కమాండ్స్‌తో ఆపరేట్ చేయవచ్చు. ఈ గెలాక్సీ బడ్స్ 4 ప్రో ధర రూ.22,999 ఉండగా, బడ్స్ 4 ధర రూ.16,999గా నిర్ణయించారు. ఇవి వైట్, బ్లాక్, పింక్ గోల్డ్ రంగుల్లో మార్చి 11 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Also Read: ట్రిపుల్ రియర్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో నథింగ్ ఫోన్.. డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×