E-Paper
Advertisement

Samsung Galaxy A06: కింగే కింగు.. శాంసంగ్ నుంచి అతి చౌక ధరలో కొత్త ఫోన్ లాంచ్..!

Samsung Galaxy A06: కింగే కింగు.. శాంసంగ్ నుంచి అతి చౌక ధరలో కొత్త ఫోన్ లాంచ్..!
Advertisement

Samsung Galaxy A06: శాంసంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అదరగొడుతోంది. రకరకాల మోడళ్లను తీసుకొస్తూ కొత్త కొత్త వేరియంట్లను పరిచయం చేస్తుంది. దేశీయ మార్కెట్‌లో శాంసంగ్ ఫోన్లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. ఈ కంపెనీ సామాన్యుల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా కంపెనీ బడ్జెట్ ధరలో ఓ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఎలాంటి లాంచ్ ఈవెంట్ లేకుండానే శాంసంగ్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది.

Galaxy సిరీస్‌లో Galaxy A06 పేరుతో చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ పరిచయం చేసింది. గతంలో Galaxy A05 లాంచ్ చేయబడింది. ఇప్పుడు దానికి అప్‌డేటెడ్ వెర్షన్‌గా కొత్త ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో కంపెనీ 4 GB + 6 GB ర్యామ్ వేరియంట్‌లను విడుదల చేసింది. దీని ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Advertisement

Samsung Galaxy A06 Price

Also Read: మోటో మామ మామూలోడు కాదు.. మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

Advertisement

కంపెనీ వియత్నాంలో Samsung Galaxy A06 బడ్జెట్ ఫోన్‌ను పరిచయం చేసింది. దీని ధర VND 3,190,000 (సుమారు రూ. 10,000)గా నిర్ణయించబడింది. ఈ ఫోన్‌ ప్రారంభ వేరియంట్ 4 GB RAM + 128 GB స్టోరేజ్‌తో వస్తుంది. వచ్చే వారం నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు 22, సెప్టెంబర్ 30 మధ్య ఫోన్‌ను ఆర్డర్ చేసిన కస్టమర్‌లు ఫోన్‌తో పాటు 25W వాల్ ఛార్జర్‌ను ఉచితంగా పొందుతారు.

Samsung Galaxy A06 Specifications

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. A సిరీస్ ఫోన్‌లలో కనిపించే కీ ఐలాండ్ ఫీచర్‌ను కంపెనీ ఈ ఫోన్‌లో అందించింది. దీనిలో వాల్యూమ్ రాకర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. Samsung Galaxy A06లో MediaTek Helio G85 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB RAMతో 64 GB స్టోరేజ్, 6 GB RAMతో 128 GB స్టోరేజ్‌ని కలిగి ఉంది. ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెకండరీ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. ఫోన్ సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×