E-Paper
Advertisement

4.2GHz స్పీడ్‌తో శాంసంగ్ కొత్త ప్రాసెసర్.. ఇక మార్కెట్‌లో మిగతా కంపెనీలకు కష్టమేనా?

4.2GHz స్పీడ్‌తో శాంసంగ్ కొత్త ప్రాసెసర్.. ఇక మార్కెట్‌లో మిగతా కంపెనీలకు కష్టమేనా?
Advertisement

Samsung Exynos 2700: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో అలరించే శాంసంగ్.. ఇప్పుడు తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ‘ఎగ్జినోస్ 2700’పై దృష్టి పెట్టింది. ఇప్పటికే గెలాక్సీ S26 సిరీస్‌లో 2ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా రూపొందించిన ఎగ్జినోస్ 2600 చిప్‌సెట్‌ను తీసుకొచ్చిన శాంసంగ్.. ఇప్పుడు అంతకుమించిన స్పీడ్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.

భారీ క్లాక్ స్పీడ్‌పై కన్ను..

ఈ కొత్త ఎగ్జినోస్ 2700 చిప్‌సెట్‌లో ప్రైమ్ కోర్ క్లాక్ స్పీడ్‌ను ఏకంగా 4.2 GHz వరకు తీసుకెళ్లాలని శాంసంగ్ సిస్టమ్ LSI విభాగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రాసెసర్లతో పోలిస్తే.. ఇది అత్యంత వేగవంతమైనదిగా నిలవనుంది. అయితే, ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ శాంసంగ్ ఫౌండ్రీకి చెందిన 2nm (SF2P) తయారీ సామర్థ్యం, దాని ఈల్డ్ శాతంపై ఆధారపడి ఉంటుంది.

మునుపటి బెంచ్ మార్క్ లీక్‌లు..

Advertisement

ఇటీవల గీక్‌బెంచ్ ప్లాట్‌ఫారమ్‌పై S5E9975 మోడల్ నెంబర్‌తో ఈ చిప్‌సెట్ వివరాలు బయటపడ్డాయి. అందులో 10-కోర్ ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ ప్రొటైప్ గరిష్టంగా 2.88 GHz క్లాక్ స్పీడ్‌ను చూపించింది. కానీ, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం శాంసంగ్ తుది వెర్షన్‌లో స్పీడ్‌ను భారీగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

Also Read: ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కెమెరా డిజైన్‌లో ఊహించని మార్పులు.. పూర్తి వివరాలు మీ కోసం!

అధికారిక సంకేతాలు..

Advertisement

శాంసంగ్ సిస్టమ్ LSI బిజినెస్ ప్రెసిడెంట్ పార్క్ యంగ్-ఇన్ కంపెనీ నివేదికలో ఎగ్జినోస్ 2700 అభివృద్ధి ఎలాంటి అంతరాయాలు లేకుండా శరవేగంగా జరుగుతోందని స్పష్టం చేశారు. రాబోయే టాప్-టైర్ స్మార్ట్‌ఫోన్లలో ఈ పవర్ ఫుల్ చిప్‌ను వాడటమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

రాబోయే గెలాక్సీ S27 విశేషాలు..

భవిష్యత్తులో రాబోయే శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ ఫోన్లలో ఈ ఎగ్జినోస్ 2700 ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయి. గ్రాఫిక్స్ కోసం గ్రేట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఎక్స్‌క్లిప్స్ 970 GPU, 12GB ర్యామ్ అలాగే ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్లు రానున్నాయి. మొబైల్ ప్రాసెసింగ్ రంగంలో మళ్లీ తమ మార్క్ చూపేందుకు శాంసంగ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Also Read: మార్కెట్‌లో స్టాక్ ఖాళీ.. ఒక్కసారిగా రూ.12,000 వరకు పెరిగిన iPhone 17 సిరీస్ ధరలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×