// //

Samsung Holi 2024 Sale: హోలీ సీజన్‌లో లాభాలు అందుకునేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ డీల్స్ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు రకరకాల పేర్లతో ఆఫర్లు ప్రకటించాయి. ఈ జాబితాలోనే తాగాజా శ్యామ్‌సంగ్ చేరింది. హోలీ సేల్ పేరుతో డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్స్ ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఈ ఆఫర్ చక్కగా ఉపయోగపడుతుంది. వేటిపై ఆఫర్లు ఉన్నాయో చూసేయండి.
ఇందులో శ్యామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్స్, ట్యాబులు, టీవీలు, ఇతర గృహోపకరణాలు ఉన్నాయి. వీటిని క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయొచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Samsung.com, శ్యామ్‌సంగ్ షోరూమ్స్, శ్యామసంగ్ స్టోర్‌లలో వీటిని కొనుగోలు చేయొచ్చు.
శ్యామసంగ్ ప్రముఖ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.25 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. ఈ హోలీ సేల మార్చి 15న ప్రారంభమై 26వ తేదీన ముగియనుంది.
Also Read: వాట్సాప్ సేఫ్టీ ఫీచర్.. వాటిని స్క్రీన్‌షాట్ తీయలేరు!
స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు
శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్,ఏ, జెడ్ సిరీస్‌లపై 60 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చన ప్రకటించింది.
ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు
శ్యామ్‌సంగ్ గెలాక్సీ బుక్4 360, గెలాక్సీ బుక్4 ప్రో, గెలాక్సీ బుక్4 ప్రో 360, గెలాక్సీ బుక్ గో, గెలాక్సీ బుక్ 3 అల్ట్రా, గెలాక్సీ బుక్3 ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
టీవీలపై ఆఫర్లు
శ్యామ్‌సంగ్ ప్రీమియం టీవీలపై రూ.15250 తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద 48 శాతం అదనపు ప్రయోజనం పొందొచ్చు. శ్యామ్‌సంగ్ నియో క్యూ ఎల్‌ఈడీ టీవీలపై ప్రత్యేక బహుమతి పొందే అవకాశం కూడా ఉంది.
Also Read: రూ.71 వేల ధర గల ఏసీ.. ఇప్పుడు కేవలం రూ.25వేల లోపే కొనేయొచ్చు..
ఇతర ఆఫర్లు