// // Youtuber Sai Krishna: యూట్యూబ్ కు సాయి కృష్ణ వీడ్కోలు.. ఎవరిని నమ్మొద్దు అంటూ.. -->
E-Paper
Advertisement

Youtuber Sai Krishna: యూట్యూబ్ కు సాయి కృష్ణ వీడ్కోలు.. ఎవరిని నమ్మొద్దు అంటూ..

Youtuber Sai Krishna: యూట్యూబ్ కు సాయి కృష్ణ వీడ్కోలు.. ఎవరిని నమ్మొద్దు అంటూ..
Advertisement

Sai Krishna Goodbye  To YouTube: యూట్యూబర్ సాయికృష్ణ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన కంటెంట్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూట్యూబర్స్ ఎలా సక్సెస్ అవ్వాలనే అంశాలకు సంబంధించి కీలక వీడియోలను షేర్ చేసేవాడు. కొన్ని కోర్సులను కూడా పోస్టు చేశాడు. సుమారు 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించాడు. కానీ, తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. యూట్యూబ్ కు గుడ్ బై చెప్తున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే..

10 ఏళ్ల ప్రయాణానికి గుడ్ బై!

తాజాగా సాయి కృష్ణ యూట్యూబ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఎమెషనల్ అవుతూనే, ఎవరినీ నమ్మొద్దని చెప్పుకొచ్చాడు. “10 ఏళ్ల ప్రయాణం ముగిసింది. ఇకపై యూట్యూబ్ లో మీ ముందుకు రాలేను. నా సబ్ స్క్రైబర్స్ కి ఒక మాట చెప్పాలి. అందుకే ఈ పోస్ట్ అయినా రాస్తున్నాను. ఇకపై వీడియోలలో మీ ముందుకి నేను రాలేను. యూట్యూబ్ లో నన్ను ఎంతగానో ఆదరించిన, అభిమానించిన, నా Subscribers కోసం.. ఒక మంచి యూట్యూబ్ కోర్స్ తయారు చేసి కొత్తగా వచ్చే వారికి ఉచితంగా అందించాలి అనే ఉద్దేశంతో ఒక మంచి కోర్స్ ని తయారు చేసి నా ఛానల్ లో ఉంచాను. కనీసం ఆ కోర్సు కొత్తగా యూట్యూబ్ లోకి వచ్చేవారికి కనీసం ఒక 2 సంవత్సరాలు ఉపయోగపడుతుంది” అని చెప్పుకొచ్చాడు.

క్రియేటర్ గా అలసిపోయాను!

Advertisement

“అలసిపోయాను.. 10 సంవత్సరాలు కంటెంట్ క్రియేటర్ గా అలసిపోయాను. కొన్ని వేల మందిని కంటెంట్ క్రియేటర్స్ గా మార్చడం వల్ల అలిసిపోయాను.. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే 3 విషయాలు గుర్తుంచుకోండి. 24 గంటలు గట్టిగ మైండ్ లో పెట్టుకోండి. 1. Be Selfish 2. Dont help anyone 3. Be Commercial. అదేంటి అంటే… Youtube లో డబ్బు సంపాదించగలగాలి అంటే మీకు ఈ మూడు క్వాలిటీస్ ఉండాలి.  ఎందుకు సెల్ఫిష్ గా ఉండాలి??? యూట్యూబ్ అనేది డబ్బు సంపాదించాలి అనుకున్న క్రియేటర్స్ కోసం మాత్రమే.  కాబట్టి, డబ్బు సంపాదించాలి అంటే సెల్ఫిష్ గానే ఉండాలి.   కానీ ఒక మంచి కంటెంట్ క్రియేటర్ అవ్వాలని మాత్రం అనుకోకండి. రోడ్ మీదకి వచ్చేస్తారు ఒక రోజు. అప్పుడు నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, దేవుడివి అన్నవాడు ఒక్కడు కూడా నీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరు” అన్నాడు.

ఎప్పుడూ మీ గురించే ఆలోచించుకోండి!

“నువ్వు డబ్బు కోసమే యూట్యూబ్ లోకి వస్తే.. నీకు అసలు రోడ్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. నా యూట్యూబ్ కమ్యూనిటీ కోసం ఏదో చేయాలి అనే నిస్వార్థం నిన్ను రోడ్ మీదకు లాగుతుంది. కాబట్టి, ఎప్పుడు నీ గురించే ఆలోచించు. స్వార్థం గా సంపాదించుకో.. జాగ్రత్త గా దాచుకో.. ఎవ్వరికి ఎటువంటి సహాయాలు చేయకు. అనుభవంతో చెప్తున్నా. ఇక్కడ ఏరు దాటాక తెప్ప తగలెయ్యలి. లేకపోఏ  నువ్వే తగాలబడిపోతావు. ఇలాంటి పనులు నాకు చేతకాలేదు. కాబట్టి.. ఎంతో మంది జీవితాలు వెలిగించిన నా జీవితం కొండెక్కింది. కాబట్టి, సెల్ఫిష్ గానే ఉండండి..పైకి వస్తారు! ఎవడు ఎలా అయినా అనుకోని… నీ బ్రతుకు నువ్వే బ్రతకాలి… నీకు ఎవ్వడు తోడు రాడు… అందుకే ఈ విషయాన్నీ కూడా మీ ముందుకు వచ్చి చెప్పలేక ఇలా ఇక్కడ రాస్తున్న. సాయికృష్ణ అని ఒకడు ఉన్నాడు కదా అని గుర్తొచ్చిచిన రోజునా ఎవడో ఒకడు వచ్చి చదువుకోవాలి కదా. అందుకే.. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి.. ఇక పై ఎటుగాలి వీస్తే ఆటే…” అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Read Also: ఏం తెలివి గురూ.. పాత ల్యాప్‌టాప్ బ్యాటరీలతో ఇంటికి కరెంట్.. ఐడియా అదుర్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×