E-Paper
Advertisement

Air Conditioner: ఏసీని 24 గంటల పాటు వాడుతున్నారా? ఇక మిమ్మల్ని పైవాడే కాపాడాలి!

Air Conditioner: ఏసీని 24 గంటల పాటు వాడుతున్నారా? ఇక మిమ్మల్ని పైవాడే కాపాడాలి!
Advertisement

Air Conditioner: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రత, వేడి గాలి, ఉక్కపోతను తట్టుకోలేక.. ప్రజలు పెద్ద ఎత్తున ఏసీలను వినియోగిస్తున్నారు. కొందరైతే అదే పనిగా ఏసీలను వినియోగిస్తూ.. చల్లటి గదులకే పరిమితం అవుతున్నారు. అయితే ఎయిర్ కండీషనర్ (AC) నిరంతరాయంగా 24 గంటల పాటు నడపడం వల్ల కలిగే ఆరు ప్రధాన నష్టాల గురించి ఈ కథనంలో పరిశీలిద్దాం.

భరించలేనంత విద్యుత్ బిల్లు

ఏసీని నిరంతరం నడవడం వల్ల కరెంట్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఇది మీ నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా పాత మోడల్ ఏసీలు అయితే విద్యుత్ ఖర్చు ఇంకా అధికమవుతుంది. నెలకు దాదాపు రూ.7,500-15,000 ఒక్క ఏసీకే ఖర్చు చేయాల్సి రావొచ్చు.

ఏసీ పాడవడం పక్కా..

Advertisement

ఏ యంత్రానికైనా విశ్రాంతి తప్పనిసరి. ఏసీని 24 గంటలపాటు రన్ చేస్తే.. అందులోని కంప్రెసర్ (Compressor), మోటార్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఏసీ జీవిత కాలం తగ్గిపోవడం, విడి భాగాలు త్వరగా పాడైపోవడం వంటివి జరగొచ్చు. ఇది ఆటోమేటిక్ గా మీపై ఆర్థిక భారాన్ని మోపుతుంది.

కూలింగ్ సామర్థ్యం తగ్గిపోవడం..

ఎక్కువ సేపు ఏసీ నడవడం వల్ల గాలిలోని ధూళి కణాలు ఫిల్టర్లలో త్వరగా పేరుకుపోతాయి. దీనివల్ల గాలి ప్రవాహం తగ్గి గదిని చల్లబరచడానికి ఏసీ మరింత కష్టపడాల్సి వస్తుంది.

గాలిలో తేమ తగ్గడం

Advertisement

సాధారణంగా ఏసీలు.. గదిలోని తేమను తగ్గించేస్తుంటాయి. నిరంతరం ఏసీలో ఉండటం వల్ల గాలి పూర్తిగా పొడిబారిపోతుంది. దీనివల్ల చర్మం సమస్యలు, కళ్ల మంటలు, గొంతు నొప్పి వంటి సమస్యలు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణంపై ప్రభావం

పర్యావరణంపై ఏసీలు ప్రతీకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అవి గాలిలోకి వేడిని, గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తుంటాయి. 24 గంటలు నడపడం వల్ల గాలిలోకి అధిక మెుత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి.

Also Read: Trump vs Kim: కిమ్‌ను టార్గెట్ చేసిన ట్రంప్.. అణు యుద్ధం తప్పదా?

అగ్ని ప్రమాదాల ముప్పు

ఏసీని అదే పనిగా ఉపయోగిస్తే.. వైరింగ్ లేదా కంప్రెసర్ అతిగా వేడెక్కుతాయి. దీని వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదముంది. నిరంతరాయంగా వాడటం వల్ల కొన్నిసార్లు వైర్లు కరిగిపోయి అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు. కాబట్టి ఓవరాల్ గా.. ఆర్థికం, ఆరోగ్యం, పర్యావరణ పరంగా ఇబ్బంది పడకూడదంటే ఏసీని పరిమితంగా వినియోగించాలను నిపులు సూచిస్తున్నారు.

Also Read: Ys jagan : ఆ వర్గాలపై జగన్ ఫోకస్..ఆ మచ్చ పోగొట్టుకునేందుకేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×