E-Paper
Advertisement

ఫ్రిడ్జ్‌లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!

ఫ్రిడ్జ్‌లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!
Advertisement

Rs 1 Coin Trick: సాధారణంగా ప్రతీ ఒక్కరు ఏదోక టైమ్ లో లాంగ్ ట్రిప్ లేదా ఊర్లకు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి, లైట్లు, ఫ్యాన్లు అన్ని బంద్ చేస్తుంటారు. అయితే ఫ్రిడ్జ్ లో ఉండే ఆహారాపదార్థాలు పాడవకుండా.. దానిని మాత్రం ఆన్ లోనే ఉంచి ప్రయాణాలకు బయలుదేరుతారు. అయితే తిరిగి వచ్చాక చాలా సందర్భాల్లో ఫ్రిడ్జ్ లోని ఆహారపదార్థాలు పాడవటం జరుగుతుంటుంది. అయితే ఆహారం చల్లగా ఉండటం వల్ల ఇది గమనించకుండానే చాలా మంది ఆ ఫుడ్ ను తిని అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే ఈ సమస్యకు రూ.1 కాయిన్ తో చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అది ఎలాగో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రూ.1 కాయిన్ ట్రిక్ ఎలా చేయాలి?

నిపుణుల సూచన ప్రకారం ఈ చిట్కాను ఫాలో అవ్వడం చాలా సింపుల్. ఇందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇందులో భాగంగా మొదట ఒక గ్లాసు లేదా ప్లాస్టిక్ కప్పులో నీళ్లు పోసి దాన్ని ఫ్రీజర్‌లో పెట్టి పూర్తిగా గడ్డకట్టేలా (ఐస్ అయ్యేలా) చేయాలి. ఆ నీరు గడ్డకట్టిన తర్వాత ఆ ఐస్ ముక్కపై ఒక రూపాయి నాణేన్ని (Rs 1 Coin) పెట్టాలి. ఇప్పుడు ఆ గ్లాసును అలాగే ఫ్రీజర్‌లో ఉంచి.. ఊరికి వెళితే సరిపోతుంది.

తిరిగి వచ్చాక ఏమవుతుంది?

Advertisement

ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రీజర్‌ తెరిచి ఆ గ్లాసును పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణెం యథావిధిగా ఐస్ పైనే ఉంటే మీరు లేని సమయంలో కరెంట్ పోలేదని అర్థం. ఫ్రీజర్‌లోని ఆహారం సురక్షితంగా ఉందని దాన్ని నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ నాణెం మధ్యలోకి లేదా కిందకు వెళ్తే.. మీరు ఊరిలో లేనప్పుడు చాలా గంటల పాటు కరెంట్ పోయిందని అర్థం చేసుకోవాలి. కరెంట్ పోవడం వల్ల ఐస్ కరిగి, నాణెం కిందికి మునిగిపోయిందన గుర్తించాలి. ఆ తర్వాత మళ్లీ కరెంట్ వచ్చాక నీరు ఐస్‌లా గడ్డకట్టిందని తెలుసుకోవాలి. దీని ప్రకారం ఫ్రీజర్‌లోని ఆహారం ఆల్రెడీ పాడైపోయి మళ్లీ గడ్డకట్టిందని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఎక్కవ కాలం జీవించాలంటే అన్నీ తినండి ఈ 3 తప్ప.. లేకుంటే చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు

రూ.1 నాణెం చిట్కా పాటించకపోతే..!

Advertisement

కరెంట్ ఎక్కువసేపు పోయినప్పుడు ఫ్రీజర్‌లోని మాంసం, పాలు, వండిన పదార్థాలలో బ్యాక్టీరియా చేరి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. మళ్లీ కరెంట్ వచ్చాక అవి మామూలుగానే కనిపిస్తాయి కానీ వాటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కేవలం ఒక రూపాయి నాణెంతో ఆరోగ్యానికి వచ్చే పెద్ద ముప్పును కనిపెట్టవచ్చని పేర్కొంటున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయాలని హితవు పలుకుతున్నారు.

Also Read: యానిమల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అయ్యో అంత బాధపడిందా..?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×