E-Paper
Advertisement

Automatic Roti Maker: హేయ్, ఇదేదో భలే ఉందే.. అలా పిండి వేస్తే.. ఇలా రోటీలు వచ్చేస్తున్నాయ్!

Automatic Roti Maker: హేయ్, ఇదేదో భలే ఉందే.. అలా పిండి వేస్తే.. ఇలా రోటీలు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Rotimatic Machine: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వంటగదిలోనూ విఫ్లవాత్మక మార్పులు వస్తున్నాయి. డిష్ వాషర్లు, ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ కుక్కర్.. ఇలా ప్రతీది వంటగదిలో మనిషి పడే శ్రమను అమాంతం తగ్గించేస్తున్నాయి. అయితే చపాతీలను సైతం అలవోకగా తయారు చేసే అత్యాధునిక పరికరం సైతం మార్కెట్ లోకి వచ్చేసింది. రోటీమాటిక్ (Rotimatic) అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా ఆటోమేటెడ్ రోటీ మేకర్. పిండి, నీరు, నూనె వేస్తే.. దానంతటే వేడి వేడి రోటీలను తయారు చేసి అందిస్తుంది. కాబట్టి ఈ రోటిమేటిక్ ఫీచర్లు, లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఆటోమేషన్

రోటీమాటిక్ రోబోటిక్ టెక్నాలజీతో రూపొందింది. ఇది పిండిని కలపడం, ఉండలు చుట్టడం, గుండ్రంగా ఒత్తడం అనంతరం కాల్చడం దానంతటదే చకా చకా చేసేస్తుంది. మీరు కేవలం పిండి రకం, రోటీ మందం, కాల్చాల్సిన స్థాయిని సెట్ చేస్తే సరిపోతుంది.

ఏఐ, వైఫై కనెక్షన్..

Advertisement

ఇది పూర్తిగా ఏఐ సాంకేతికతతో పనిచేస్తుంది. ఫలితంగా ప్రతి రోటీ సమానంగా కాల్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు దీనికి వైఫై కనెక్షన్ వంటి ఫీచర్ ను సైతం అందించారు. దీని ద్వారా సాఫ్ట్ వేర్ అప్డేట్స్ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. సాఫ్ట్ వేర్ అప్డేట్స్ ద్వారా పూరి, పిజ్జా వంటివి కూడా యాడ్ అవుతాయి.

నచ్చిన సైజులో రోటీలు..!

వినియోగదారులు తమకు నచ్చిన విధంగా రోటీలను తయారు చేసుకోవచ్చు. రోటీ ఎంత మెత్తగా ఉండాలి, ఎంత నూనె వాడాలి, రోటీ ఎంత ఎర్రగా కాలాలి వంటి ఆప్షన్లను మెషీన్ స్క్రీన్ ద్వారా ముందుగానే సెట్ చేసుకోవచ్చు.

నిమిషానికో రోటీ తాయరీ..

Advertisement

Rotimatic పరికరం.. నిమిషానికి ఒక రోటీ చొప్పున తయారు చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒక ట్రిప్ కు గరిష్టంగా 20 రోటీల వరకూ చేసుకోవచ్చు. మరిన్ని రోటీలు కావాలంటే ఇంకాస్త పిండి, నూనె, నీరు వేస్తే సరిపోతుంది.

Also Read: Iran AI Video: ఇజ్రాయెల్‌ను దెబ్బకొట్టాలంటే.. దానిమ్మ జ్యూస్ తాగండి.. ఏఐ వీడియోతో ఇరాన్ సెటైర్లు!

మరికొన్ని లాభాలు!

ఉద్యోగస్తులు, ఇంట్లో క్షణం కూడా తీరికలేని మహిళలకు ఈ రోటీ మేకర్ గొప్పవరంగా చెప్పవచ్చు. పిండి కలపడం నుండి కాల్చే వరకు పట్టే సమయాన్ని ఇది ఆదా చేస్తుంది. ఆ సమయంలో మీరు ఇతర పనులను పూర్తి చేసుకోవచ్చు. కేవలం గోధుమ రొట్టెలే కాకుండా, జొన్న రొట్టెలు, బాజ్రా రొట్టెలు, మల్టీ గ్రెయిన్ రోటీలను కూడా దీంతో చక్కగా చేసుకోవచ్చు.

ముఖ్యగమనిక: ఆటోమేటిక్ రోటీ మేకర్ ఫీచర్లను కంపెనీ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు. కొనుగోలు చేయాలని భావిస్తే.. ఒకటికి రెండుసార్లు ఫీచర్లు, ధరను చెక్ చేసుకుంటే మంచిది.

Also Read: Upcoming Induction Stoves: ఏప్రిల్‌లో విడుదలయ్యే.. టాప్ మోస్ట్ ఇండక్షన్ స్టవ్స్.. నిజంగా అద్భుతం భయ్యా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×