E-Paper
Advertisement

జియో మరో క్రేజీ ప్లాన్.. రూ. 1,748 కే 11 నెలల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, డేటా, లైవ్ ఛానల్స్!

జియో మరో క్రేజీ ప్లాన్.. రూ. 1,748 కే 11 నెలల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, డేటా, లైవ్ ఛానల్స్!
Advertisement

Jio Plans: రిలయన్స్ జియో (Reliance Jio) ఆఫర్ చేస్తున్న చౌకైన లాంగ్ టర్మ్ ప్లాన్లలో రూ. 1,748 ప్రిపేడ్ ప్లాన్ ఒకటి. తరచుగా రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా ఒకే రీఛార్జ్‌తో 11 నెలల పాటు సేవలు పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు రూ.5.2, నెలకు రూ.156.07 మాత్రమే ఖర్చు కానుంది. కాబట్టి ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలు, బెనిఫిట్స్ గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

336 రోజుల వ్యాలిటిడీ..

ఈ ప్లాన్ లో అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని వ్యాలిడిటీ. సాధారణంగా ప్లాన్లు 28 రోజులు, 84 రోజులు ఉంటాయి. కానీ ఈ రూ. 1,748 ప్లాన్ ఏకంగా 336 రోజుల వాలిడిటీతో వచ్చింది. ఒకసారి రీఛార్జ్ చేస్తే దాదాపు 11 నెలల పాటు రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

అపరిమిత కాల్స్, డేటా

Advertisement

ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటో 336 రోజుల పాటు దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయినా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో మొత్తం వ్యాలిడిటీ కాలానికి 24 GB డేటా మాత్రమే లభిస్తుంది. దానిని ఎప్పుడైనా వాడుకోవచ్చు. మరోవైపు ఈ ప్లాన్ కింద మెుత్తం కాలానికి 3600 ఎస్ఎంఎస్ లు ఇవ్వనున్నారు.

జియో యాప్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

ఇందులో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ను సైతం జియో ఆఫర్ చేస్తోంది. జియో డిజిటల్ కంటెంట్ కు సంబంధించి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్లు అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కు యాక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా జియో టీవీలో లైవ్ ఛానెల్స్, జియో సినిమాలో వెబ్ సిరీస్ లు, మూవీస్ చూసేందుకు యూజర్లకు అవకాశం లభించనుంది.

Advertisement

Also Read: ఇద్దరి మధ్య చిచ్చు పెడతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న విషయానికి పెద్ద గొడవ చేస్తారు

ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్?

ఇంట్లో లేదా ఆఫీస్‌లో వైఫై వాడుతూ.. మొబైల్ డేటా కేవలం యూపీఐ చెల్లింపులు ఉంటే చాలని భావిస్తే ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అలాగే బయటకు వెళ్లినప్పుడు వాట్సప్ మెసేజ్ పంపేందుకు సరిపడ డేటా ఉంటే చాలని కోరుకునేవారికి సైతం ఇది సరిగ్గా సరిపోతుంది. మరోవైపు సిమ్ యాక్టివ్ గా ఉండటంతో పాటు ప్రతీ నెల రీఛార్జ్ చేసుకునే భారం వద్దని భావించేవారికి సైతం ఈ చౌకైన లాంగ్ టర్మ్ ప్లాన్ అత్యుత్తమమైనదిగా నిలుస్తుందని జియో వర్గాలు చెబుతున్నాయి.

Also Read: విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్.. విజయవాడ మీదుగానేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×