E-Paper
Advertisement

రూ. 123, రూ.234, రూ.369.. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్లాన్స్.. బోలెడన్ని బెనిఫిట్స్ భయ్యా!

రూ. 123, రూ.234, రూ.369.. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్లాన్స్.. బోలెడన్ని బెనిఫిట్స్ భయ్యా!
Advertisement

Jio Plans: దేశంలో ప్రముఖ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. అయితే తన జియో భారత్, జియో ఫోన్ వంటి ఫీచర్ మెుబైల్స్ కోసం.. ప్రత్యేక ప్లాన్స్ ను జియో ప్రకటించింది. ఇందుకో 4G ఫీచర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే గతంలో ఉన్న బేసిక్ ఫీచర్ ప్లాన్ ను రూ.91ను తొలగించి.. రూ.123 ప్లాన్ ను రీప్లేస్ చేసింది. ఈ నేపథ్యంలో రూ.123 ప్లాన్ తో పాటు ఫీచర్ ఫోన్ల కోసం తీసుకొచ్చి రూ.234, రూ.369 ప్లాన్ వివరాలు, వాటి రీఛార్జ్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ. 123 రీఛార్జ్ ప్లాన్

జియో 4G ఫీచర్ ఫోన్ కోసం ప్రస్తుతం బేసిక్ ప్లాన్ గా ఇది ఉంది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ప్రతిరోజూ 0.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజులు పూర్తయ్యే సరికి 14 GB డేటా యూజర్ కు లభిస్తుంది. దీంతో పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్లాన్ మెుత్తానికి 300 SMSలు వాడుకోవచ్చు. అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

రూ. 234, రూ. 369 ప్లాన్‌లు

Advertisement

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారి కోసం జియో ఈ రెండు ప్లాన్స్ తీసుకొచ్చింది. రూ. 234 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీని ఇస్తుండగా.. రూ. 369 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లలో కూడా రోజుకు 0.5 GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతి 28 రోజులకు 300 SMSల చొప్పున బెనిఫిట్స్ యూజర్ కు లభిస్తాయి. డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది.

రూ. 1,234 వార్షిక ప్లాన్

ఫీచర్ ఫోన్లలో ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకుంటే ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద.. ప్రతీ రోజూ 0.5 GB డేటా లభిస్తుంది. ప్లాన్ పూర్తయ్యే సమయానికి 168 GB డేటా పొందొచ్చు. వీటితో పాటు అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ లు యథావిధిగా లభిస్తాయి. ఇది కాకుండా కొత్తగా 4G ఫీచర్ ఫోన్ కొనేవారి కోసం జియో రూ. 21తో ఒక ప్రత్యేక ‘ఆన్‌బోర్డింగ్’ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది కేవలం 4 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ డేటాను అందిస్తుంది.

Advertisement

Also Read: Roja Selvamani: ఇదేందయ్యా ఇది.. జగన్‌ను కాపీ కొట్టి విజయ్ గెలిచారా? రోజా కామెంట్స్ వైరల్!

డేటా యాడ్ ఆన్ ప్యాక్‌లు

ఫీచర్ ఫోన్లలో రోజువారీ డేటా పరిమితి అయిపోయినప్పుడు వాడుకోవడానికి జియో కొన్ని చౌకైన యాడ్ ఆన్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. రూ. 26 రీఛార్జ్‌తో 2 జీబీ డేటాను, రూ. 62తో 6 జీబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో పొందొచ్చు. అలాగే రోజువారీ డేటా బూస్టర్లు కావాలనుకునే వారు రూ. 86 (రోజుకు 0.5 జీబీ), రూ. 122 (రోజుకు 1 జీబీ), రూ. 182 (రోజుకు 2 జీబీ) ప్లాన్‌లను కూడా ట్రై చేయవచ్చు.

Also Read: Poco C81 vs Poco C81x: రెండూ మధ్యతరగతి ఫోన్లే.. పైగా ధర తక్కువ.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×