E-Paper
Advertisement

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!
Advertisement

Fridge Maintenance Tips: ఇళ్లలో వంటగది అనగానే మసాలాలు, వేడి వేడి వంటలు, తేమ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో ఇల్లంతటికీ రక్షణగా నిలిచే కీలకమైన హోమ్ అప్లయన్స్ ‘ఫ్రిజ్’. సాధారణంగా చాలా మంది ఫ్రిజ్ కొన్నాక దాన్ని అలాగే.. వదిలేస్తుంటారు. ఏదైనా రిపేర్ వస్తే తప్ప పట్టించుకోరు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. మీ ఫ్రిజ్ ఎలాంటి రిపేర్లు లేకుండా హ్యాపీగా పదేళ్ల పాటు కొత్త దానిలా పని చేస్తుంది. ఫ్రిజ్ లైఫ్ పెంచే 5 అద్భుతమైన మెయింటెనెన్స్ సీక్రెట్స్.. వాటికి అయ్యే ఖర్చుల వివరాలు..

1. కండెన్సర్ కాయిల్స్ క్లీనింగ్ (Condenser Coils):
ఫ్రిజ్ వెనక లేదా కింద భాగంలో ఉండే.. కండెన్సర్ కాయిల్స్ ఫ్రిజ్‌లోని వేడిని బయటకు పంపుతాయి. ఇండియన్ కిచెన్స్‌లో ఉండే జిడ్డు, దుమ్ము వీటిపై త్వరగా పేరుకుపోతాయి. దీని వల్ల కంప్రెసర్‌పై భారం పడి ఫ్రిజ్ త్వరగా పాడవుతుంది.

Advertisement

ఏం చేయాలి?: ఏడాదికి రెండు సార్లు ఫ్రిజ్ ప్లగ్ తీసేసి, వెనక ఉన్న కాయిల్స్‌ను బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేయాలి.

సర్వీసింగ్ ఖర్చు: మీరే సొంతంగా క్లీన్ చేసుకుంటే.. రూపాయి ఖర్చు లేదు. ఒకవేళ టెక్నీషియన్‌ను పిలిస్తే.. బేసిక్ క్లీనింగ్ , జనరల్ సర్వీస్ ధర సుమారు రూ.400 నుంచి రూ. 600 వరకు ఉంటుంది.

Advertisement

2. డోర్ గ్యాస్కెట్ (రబ్బర్ సీల్) చెక్ చేయడం:
ఫ్రిజ్ డోర్ చుట్టూ ఉండే.. రబ్బర్ సీల్ సరిగ్గా ఉంటేనే లోపలి కూలింగ్ బయటకు పోకుండా ఉంటుంది. మన వాళ్లు రోజూ పచ్చళ్ళు, కూరల గిన్నెలు తీసేటప్పుడు.. ఈ రబ్బర్‌కు జిడ్డు అంటుకుంటుంది. రబ్బర్ లూజ్ అయితే కూలింగ్ తగ్గి, కరెంట్ బిల్లు విపరీతంగా పెరుగుతుంది.

ఏం చేయాలి?: ఒక పేపర్ ముక్కను డోర్ మధ్యలో పెట్టి లాగండి. అది ఈజీగా వచ్చేస్తే రబ్బర్ పాడైందని అర్థం. దీన్ని ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీటితో తుడవాలి.

మార్చడానికి అయ్యే ధర: ఒకవేళ గ్యాస్కెట్ పూర్తిగా పాడైపోయి కొత్తది వేయించాల్సి వస్తే, మోడల్‌ను బట్టి దీని ధర రూ. 1,800 వరకు ఉంటుంది.

3. కంప్రెసర్ సేఫ్టీ స్టెబిలైజర్ వాడకం:
పవర్ ఫ్లక్చుయేషన్స్ (వోల్టేజ్ హెచ్చుతగ్గులు) చాలా ఎక్కువ. కొత్త ఫ్రిజ్‌లకు ఇన్‌బిల్ట్ స్టెబిలైజర్ ఉన్నప్పటికీ, హై-వోల్టేజ్ వచ్చినప్పుడు కంప్రెసర్ కాలిపోయే ప్రమాదం ఉంది. ఫ్రిజ్ గుండెకాయ లాంటి కంప్రెసర్ పోతే భారీ ఖర్చు అవుతుంది.

ఏం చేయాలి?: మంచి బ్రాండెడ్ డిజిటల్ వోల్టేజ్ స్టెబిలైజర్‌ను వాడటం ఎల్లప్పుడూ సురక్షితం.

కొత్త స్టెబిలైజర్ ధర: ఒక బెస్ట్ క్వాలిటీ స్టెబిలైజర్ (ఉదాహరణకు V-Guard) మార్కెట్లో రూ.1,500 నుంచి రూ. 2,500 లోపు లభిస్తుంది. ఒకవేళ కంప్రెసరే పాడైతే, కొత్తది మార్చడానికి రూ. 6,000 వరకు ఖర్చవుతుంది.

4. గోడకు, ఫ్రిజ్‌కు మధ్య గ్యాప్ :
చాలా మంది స్థలం కలిసి వస్తుందని ఫ్రిజ్‌ను తీసుకెళ్లి గోడకు నొక్కి పెట్టేస్తారు. దీని వల్ల వెనక వచ్చే వేడి గాలి బయటకు పోవడానికి సరుకు ఉండదు.

ఏం చేయాలి?: గోడకు, ఫ్రిజ్ వెనక భాగానికి మధ్య కనీసం 6 అంగుళాల ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల గాలి ఫ్రీగా ఆడి ఫ్రిజ్ కూలింగ్ సిస్టమ్ సేఫ్‌గా ఉంటుంది. దీనికి పైసా ఖర్చు అవ్వదు.

Also Read: బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

5. ఓవర్‌లోడ్ చేయకూడదు:
పండగలు వచ్చినా.. సండే మార్కెట్ నుంచి తెచ్చినా ఫ్రిజ్ నిండా గిన్నెలు, కూరగాయలు కుక్కేస్తుంటారు. ఫ్రిజ్ లోపల గాలి తిరగడానికి కొద్దిగా ఖాళీ ఉండాలి. లేదంటే థర్మోస్టాట్ , ఫ్యాన్ మోటార్‌పై ప్రెజర్ పడుతుంది.

ఏం చేయాలి?: ఫ్రిజ్‌ను ఎప్పుడూ 80% కంటే ఎక్కువ నింపకండి. అలాగే వేడి వస్తువులను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

ఫ్యాన్ మోటార్ రిపేర్ ధర: లోపలి ఫ్యాన్ మోటార్ పాడైతే మార్చడానికి సుమారు రూ. 2,000 ఖర్చు అవుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×