E-Paper
Advertisement

ఏసీ, కూలర్ ఎంత వాడినా.. సగం కరెంటు బిల్లే రావాలా? ఈ 4 పనులు చేస్తే సరి!

ఏసీ, కూలర్ ఎంత వాడినా.. సగం కరెంటు బిల్లే రావాలా? ఈ 4 పనులు చేస్తే సరి!
Advertisement

Power Saving Tips: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు మరింత పెరిగిపోతున్నాయి. మే నెల రాకముందే రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు అవుతోంది. అయితే భానుడి తాపం నుంచి తప్పించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలు, కూలర్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెలపూర్తయ్యే సరికి పవర్ బిల్లు ఎంత వస్తుందోనన్న దిగులు కొందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీ లేదా కూలర్ ఎంత వాడినా విద్యుత్ బిల్లును సగానికి తగ్గించే 4 అతిముఖ్యమైన చిట్కాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

24°C టెంపరేచర్

చాలామంది గది త్వరగా చల్లబడాలన్న ఉద్దేశ్యంతో ఏసీని 16°C – 18°C మధ్య ఉంచుతారు. అయితే ఇది చాలా తప్పు అని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) పేర్కొంది. అలా కాకుండా ఏసీని 24°C వద్ద నడపడం వల్ల కంప్రెషర్‌పై భారం తగ్గి దాదాపు 24% వరకు విద్యుత్ ఆదా అవుతుందని స్పష్టం చేసింది. ఏసీలో ప్రతి ఒక్క డిగ్రీ టెంపరేచర్ పెంచినప్పుడు 6% వరకూ విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు.

సీలింగ్ ఫ్యాన్‌ వినియోగం

Advertisement

ఏసీ లేదా కూలర్‌తో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో ఉంచడం వల్ల గదిలోని చల్లని గాలి అన్ని వైపులా సమానంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఏసీని తక్కువ మోడ్‌లో ఉంచినా గది చల్లగా ఉంటుంది. ఫ్యాన్ గాలి మరింత చల్లగా శరీరానికి తగలడం వల్ల.. చాలా హాయిగా, ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతుంది.

వెంటిలేషన్

ఏసీ వాడేటప్పుడు.. గది కిటికీలు, తలుపులు పూర్తిగా మూసి ఉంచాలి. గదిలోకి వేడి గాలి రాకుండా డార్క్ కర్టెన్లు వాడటం వల్ల ఏసీ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా ఏసీపై ఒత్తిడి తగ్గి తక్కువ విద్యుత్ ను వినియోగిస్తుంది. ఒక వేళ కూలర్ వాడుతున్నట్లైతే ఇందుకు భిన్నంగా కిటికీలు, తలుపు తెరిచి ఉంచాలి. కూలర్ గదిలో తేమను పెంచుతుంది కాబట్టి.. గాలి బయటకు వెళ్లేలా కిటికీని కొద్దిగా తెరిచి ఉంచాలి. అప్పుడే కూలర్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

Advertisement

Also Read: Flipkart Offers: ఏంది మామ ఇది.. Carrier 1.5 Ton ఏసీ.. ఇంత చౌకగా ఇచ్చేస్తున్నారు!

ఫిల్టర్ల శుభ్రత

ఏసీ లేదా కూలర్ ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే.. అవి చల్లని గాలిని పంపడానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. కాబట్టి నెలకోసారి ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేయడం వల్ల విద్యుత్ వినియోగం 5% నుండి 15% వరకు తగ్గించుకోవచ్చు. మరోవైపు కూలర్ ప్యాడ్లను క్రమం తప్పకుండా మార్చడం, శుభ్రం చేయడం వల్ల కూడా చల్లదనం పెరుగుతుంది. అదే సమయంలో విద్యుత్ భారం కూడా తగ్గుతుంది.

Also Read: రోజుకు 14-15 గంటలు కూలర్ వాడితే.. పవర్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×