E-Paper
Advertisement

ఏసీ వాడకంలో ఈ 5 మార్పులు చేసుకుంటే.. 30 శాతం వరకు విద్యుత్ ఆదా!

ఏసీ వాడకంలో ఈ 5 మార్పులు చేసుకుంటే.. 30 శాతం వరకు విద్యుత్ ఆదా!
Advertisement

AC Maintenance Tips: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బయట ఎండల కంటే ఇంట్లో వచ్చే కరెంట్ బిల్లు చూసే ఎక్కువ మందికి చెమటలు పడుతుంటాయి. చల్లదనం కోసం ఏసీని రోజంతా ఆన్ చేసి ఉంచుతాం కానీ, నెల తిరిగేసరికి ఆ బిల్లు వేలల్లో రావడం చూసి షాక్ అవుతాం. అసలు ఏసీ వేసినా గది ఎందుకు చల్లబడదు? బిల్లు ఎందుకు అంతలా పెరుగుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. అయితే ఏసీ వాడకంలో ఈ ఐదు మార్పులు చేసుకుంటే కరెంటును 30% ఆదా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఫిల్టర్లను క్లీన్ చేస్తుండాలి:

చాలామంది ఏసీ ఫిల్టర్లను సీజన్ మొదట్లో ఒకసారి క్లీన్ చేసి వదిలేస్తారు. కానీ కొన్నిసార్లు దుమ్ము, ధూళితో ఫిల్టర్లు త్వరగా నిండిపోతుంటాయి. కనీసం 10 రోజులకు ఒకసారైనా ఫిల్టర్లను శుభ్రం చేయసుకోవాల్సిందే. దీనివల్ల గాలి ఫ్రీగా రావడమే కాకుండా, కంప్రెసర్ మీద లోడ్ తగ్గి కరెంట్ తక్కువగా కాలుతోంది. ఫిల్టర్ పట్టుకుని చూస్తే అటువైపు వెలుతురు సరిగ్గా కనిపించలేదంటే అది మురికిగా ఉందని అర్థం. అప్పుడు వాటిని తీసి వెంటనే క్లీన్ చేసుకుంటే సరి.

ఏసీని 24 డిగ్రీల్లోనే ఉంచాలి:

Advertisement

ఏసీ ఆన్ చేసిన నిమిషంలోనే గది చల్లబడాలనే ఆత్రుతతో చాలామంది 16 లేదా 18 డిగ్రీల వద్ద పెడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల కంప్రెసర్ ఆగకుండా తిరుగుతూ బిల్లును పెంచేస్తుంది. అందుకే 24 డిగ్రీల వద్ద ఉంచి, ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టాలి. ఇది గదిలో చల్లదనాన్ని సమానంగా పరచడమే కాకుండా, ఏసీకి విశ్రాంతిని కూడా ఇస్తుంది. దీనివల్ల కరెంట్ వినియోగంలో చాలా తేడా కనిపిస్తుంది.

అవుట్‌డోర్ యూనిట్ కూడా ముఖ్యమే:

మనలో చాలామంది కేవలం ఇంట్లో ఉండే ఏసీనే చూస్తారు కానీ, బయట ఎండలో ఉండే అవుట్‌డోర్ యూనిట్‌ను పూర్తిగా వదిలేస్తాం. దాని వెనుక ఉండే కాయిల్స్‌పై దుమ్ము పేరుకుపోతే లోపలి వేడి సరిగ్గా బయటకు వెళ్లదు. అందుకే అప్పుడప్పుడు మెయిన్ స్విచ్ ఆపేసి, అవుట్‌డోర్ యూనిట్‌ను నీళ్లతో మెల్లగా కడగాలి. ఈ చిన్న పని ఏసీ పనితీరును పెంచి, మెషిన్ వేడెక్కకుండా హాయిగా నడిచేలా చేస్తోంది.

Advertisement

Also Read: ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!

నీళ్లపైపు మీద ఓ కన్నేయండి:

ఏసీ నుంచి నీరు లీక్ అవ్వడం లేదా గదిలో ఒక రకమైన వాసన రావడం వంటివి చాలామందికి ఎదురయ్యే సమస్యలే. దీనికి ప్రధాన కారణం నీళ్లు బయటకు వెళ్లే డ్రైన్ పైపులో పేరుకుపోయే జిగురు లాంటి మురికి. తేమ, దుమ్ము కలిసి పైపును బ్లాక్ చేస్తాయి. అప్పుడప్పుడు ఆ పైపును క్లియర్ చేయడం వల్ల నీరు సాఫీగా బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల గదిలో తేమ ఉండదు. ఏసీ లైఫ్ కూడా పెరుగుతుంది.

ప్లగ్ బోర్డులను చెక్ చేస్తున్నారా?

ఎలక్ట్రికల్ ప్లగ్ లూజ్‌గా ఉండటం లేదా సాకెట్ దగ్గర నల్లటి మచ్చలు రావడాన్ని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే.. ఇది ఏసీ పనితీరును దెబ్బతీస్తుంది. ఏసీకి సరైన వోల్టేజ్ అందకపోతే అది ఎక్కువ పవర్ లాగుతుంది. అందుకే సీజన్ మొదలయ్యే ముందే ప్లగ్ పాయింట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది. ఒకవేళ ఏసీ పైపుల మీద మంచు పేరుకుపోయినా లేదా ఏవైనా శబ్దాలు వస్తున్నా ఆలస్యం చేయకుండా టెక్నీషియన్‌ను పిలిపించి చెక్ చేపించుకోవాలి.

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.25వేల లోపు 4K QLED టీవీలు.. శాంసంగ్, షావోమీల మోడల్స్‌పై కళ్లుచెదిరే ఆఫర్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×