E-Paper
Advertisement

150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, అమోలెడ్ డిస్‌ప్లే.. మార్కెట్లోకి Redmi Watch 6 ఎంట్రీ, ఇక రచ్చే!

150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, అమోలెడ్ డిస్‌ప్లే.. మార్కెట్లోకి Redmi Watch 6 ఎంట్రీ, ఇక రచ్చే!
Advertisement

Redmi Watch 6: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ Redmi Watch 6ను అంతర్జాతీయ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. గతేడాది చైనాలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ వాచ్.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం పోలాండ్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో అమ్మకాలు మొదలయ్యాయి. ఇందులో నార్మల్ వేరియంట్‌తో పాటు NFC సదుపాయం ఉన్న మరో మోడల్ కూడా ఉంది. ఈ వాచ్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.8,200 నుంచి మొదలవుతోంది.

యాపిల్ వాచ్ లాంటి డిజైన్..

ఈ వాచ్ చూడటానికి చాలా క్లాస్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. దీనిలో 2.07 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. డిస్‌ప్లే అంచుల్లో కర్వ్డ్ గ్లాస్ ఉండటం వల్ల వాచ్ ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. మనకు కావాల్సినట్లుగా వాచ్ ఫేస్‌లను మార్చుకోవచ్చు. ఇక ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ వాచ్ చూడటానికి అచ్చం యాపిల్ వాచ్ లుక్‌ను కలిగి ఉంటుంది.

Advertisement

Also Read: ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పొడవుగా ఉంటే.. ఛార్జ్ స్లోగా ఎక్కుతుందా? టెక్ నిపుణులు చెప్పిన సీక్రెట్ ఇదే!

150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్..

హెల్త్ విషయంలో అస్సలు రాజీ పడకుండా రెడ్‌మీ ఈ వాచ్‌లో బోలెడు ఫీచర్లు పెట్టింది. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ (SpO2), గుండె వేగం, స్ట్రెస్ లెవల్స్ వంటివి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. మనం సరిగ్గా నిద్రపోతున్నామా లేదా అని చెప్పే స్లీప్ అనాలిసిస్ ఫీచర్ కూడా ఉంది. వ్యాయామం చేసే వారి కోసం 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అలాగే మనం వాకింగ్ లేదా రన్నింగ్ మొదలుపెట్టగానే ఈ వాచ్ దానంతట అదే గుర్తించి ట్రాక్ చేస్తుందట.

12 రోజుల బ్యాటరీ బ్యాకప్..

Advertisement

స్మార్ట్‌వాచ్ కొనేవారు మెయిన్‌గా చూసేది బ్యాటరీ బ్యాకప్. రెడ్‌మీ వాచ్ 6ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణంగా వాడుకున్నా 12 రోజుల వరకు వస్తుంది. అదే సేవర్ మోడ్‌లో అయితే ఏకంగా 24 రోజుల వరకు బ్యాటరీ ఉంటుంది. ఇక నీళ్లలో తడిసినా, స్విమ్మింగ్ చేసినా ఏమీ కాకుండా వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం ఉంది. అలాగే ఈ వాచ్‌లో ఉన్న GPS సాయంతో మనం ఎక్కడికి వెళ్లినా లొకేషన్‌ను చాలా కచ్చితంగా ట్రాక్ చేయొచ్చు. బరువు కూడా తక్కువగా ఉండటంతో రోజంతా చేతికి పెట్టుకున్నా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

Also Read: మడతపెట్టే ఫోన్లలో మోటరోలా సరికొత్త ప్రయోగం.. Razr Fold భారత్‌లోకి వచ్చేస్తోంది, మీరు రెడీయా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×