E-Paper
Advertisement

Redmi Watch 5 Active Review : వాచ్ ఏంటి భయ్యా ఇంత ఉంది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.. రేట్ ఎంత అంటే?

Redmi Watch 5 Active Review : వాచ్ ఏంటి భయ్యా ఇంత ఉంది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.. రేట్ ఎంత అంటే?
Advertisement

Redmi Watch 5 Active Review : తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా.. స్మార్ట్ ఫీచర్స్ తో పాటు బెస్ట్ హెల్త్ ఫీచర్స్ ఉండే హై క్వాలిటీ స్మార్ట్ వాచ్ ను గ్జియోమీ తాజాగా లాంఛ్ చేసింది. హై క్వాలీటీతో పాటూ స్పెషల్ ఫీచర్స్ ను కలిగి ఉండే ఈ స్మార్ట్ వాచ్ పై ఓ లుక్కేయండి.

ప్రముఖ కంపెనీ గ్జియోమీ తాజాగా భారత్ లో రెడ్ మీ వాచ్ 5 యాక్టివ్‌ను లాంఛ్ చేసింది. మల్టిపుల్ ఫీచర్స్ తో లాంఛ్ అయిన ఈ స్మార్ట్ వాచ్ లో టాప్ ఫీచర్స్ ను సదరు కంపెనీ జోడించింది. హెల్త్ ఫీచర్స్, బ్లూటూత్ కాలింగ్, బిగ్ బ్రెైట్ డిస్‌ప్లేతో లాంఛ్ అయిన ఈ వాచ్ అందుబాటు ధరలోనే మార్కెట్లోకి వచ్చేసింది.

Advertisement

ALSO READ : సూపర్ డీల్ భయ్యా.. కీబోర్డ్, మౌస్, హెడ్‌సెట్స్ పై 76% తగ్గింపు.. ఇంకా ఏం ఉన్నాయంటే!

ఫిట్‌నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే గాడ్జెట్స్ ను లాంఛ్ చేసే గ్జియోమీ…రెడ్ మీ వాచ్ 5 యాక్టివ్‌ వాచ్ లో…  SpO2 మానిటర్, హార్ట్ రేట్ సెన్సార్, స్ట్రెస్ లెవెల్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్ లాంటి హెల్త్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. 2 అంగుళాల డిస్‌ప్లే తో బ్లూటూత్ కాలింగ్‌కు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ మార్కెట్ ధర రూ. 3,000 కంటే తక్కువగానే ఉంది.

Advertisement

రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్ రివ్యూ

డిజైన్, డిస్‌ప్లే – ఈ స్మార్ట్ వాచ్ జింక్ బాడీతో 2 అంగుళాల డిస్‌ప్లే, దృఢమైన వాచ్ కేస్, సింగిల్ బటన్ ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ హార్ట్ సెన్సార్, SpO2 సెన్సార్, కాల్స్ మాట్లాడే స్పీకర్, డ్యూయల్ ఛార్జింగ్ పిన్స్ అందుబాటులో ఉన్నాయి. 42.2 గ్రాముల బరువును కలిగి ఉండి… డిస్ ప్లే 320 x 385 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు రైజ్ టు వేక్, ట్యాప్ టు వేక్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇక ఆటో బ్రైట్‌నెస్ సెన్సార్‌, తడిచినా రిపేర్ కాని స్టాంగ్ సిస్టమ్ ఈ వాచ్ సొంతం. ఈ వాచ్ తో స్విమ్మింగ్ సైతం చెయ్యెచ్చని గ్జియోమీ వెల్లడించింది.

ఓఎస్ సపోర్ట్ – రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్‌లో హైపర్‌ ఓఎస్‌ ప్రత్యేక ఆకర్షణ. ఇది స్ట్రీమ్‌ లైన్డ్ యూజర్ ఇంటర్‌ ఫేస్‌ను అందిస్తుంది. Alexa సపోర్ట్‌, వెదర్ అపడేట్స్, టైమర్ సెట్ అప్ కలిగి ఉంది. నిర్దిష్ట టైమర్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 140+ స్పోర్ట్స్ మోడల్స్ లో అందుబాటులో ఉన్న ఈ వాచ్.. వాటర్ ఫ్రూఫ్ సిస్టమ్ ను కలిగి ఉంది.

బ్యాటరీ – 100% ఛార్జ్ ను 1:26 నిమిషాల్లో చేరుకోగలిగే 470mAh బ్యాటరీ.. రెగ్యూలర్ ఉపయోగించినప్పటికీ 7 రోజుల వరకూ పనిచేస్తూనే ఉంటుంది. వెనుక వైపు ఉండే డ్యూయల్ ఛార్జింగ్ పిన్స్ పవర్ బ్యాంక్ తో ఛార్జ్ చేసేందుకు సపోర్ట్ చేస్తాయి.

బ్లూటూత్ కాలింగ్ – ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రయాణాల్లో, ఫోన్ పాకెట్ నుంచి బయటకు తీయలేని స్థితిలో ఇది మంచి ఆఫ్షన్. వెనుకవైపు సింగిల్ స్పీకర్‌తో కాల్ క్వాలిటీ బిగ్గరా, స్పష్టంగా వినిపిస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×