E-Paper
Advertisement

మార్కెట్లోకి సరికొత్త రెడ్‌మీ కొత్త ఫోన్.. 50MP OIS కెమెరా, ఆండ్రాయిడ్ 16తో అరాచకం!

మార్కెట్లోకి సరికొత్త రెడ్‌మీ కొత్త ఫోన్.. 50MP OIS కెమెరా, ఆండ్రాయిడ్ 16తో అరాచకం!
Advertisement

Redmi Note 17 5G: బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించే రెడ్‌మీ నోట్ సిరీస్‌ నుంచి త్వరలోనే మరో సరికొత్త ‘రెడ్‌మీ నోట్ 17 5G’ ఫోన్ లాంచ్‌ కానుందని సమాచారం. అయితే సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. దీనికి సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వచ్చిన రెడ్‌మి నోట్ 15 5Gకి సక్సెసర్‌గా వస్తున్న ఈ కొత్త మోడల్‌లో భారీ మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా లీకైన సమాచారం ప్రకారం చూస్తే ఈ ఫోన్‌లో ప్రీమియం క్వాలిటీ ఉన్న OLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 1.5K రెజల్యూషన్‌తో రాబోతోంది. తద్వారా వీడియోలు చూసేటప్పుడు విజువల్స్ చాలా క్లియర్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. దీనికి తోడు 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు, స్క్రీన్ స్క్రోల్ చేసేటప్పుడు ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. స్క్రీన్ రెస్పాన్స్ మరింత బాగుండటం కోసం ఇందులో నోవాటెక్ టచ్ ప్యానెల్‌ను వాడుతున్నట్లు టాక్.

Advertisement

Also Read: అమెజాన్ సేల్‌లో ఆఫర్ల జాతర.. రూ.30 వేల లోపే సోనీ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ, ఇప్పుడే కొనేయండి!

మల్టీటాస్కింగ్, గేమింగ్ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. దీనికి అడ్రినో 710 జీపీయూ గ్రాఫిక్స్ తోడు కావడం వల్ల రోజువారీ పనులతో పాటు మొబైల్ గేమింగ్ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా సాగిపోతుంది. అలాగే ఇందులో 6GB RAM, వేగవంతమైన యూఎఫ్ఎస్ స్టోరేజ్ ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత లేటెస్ట్ హైపర్‌ఓఎస్ 3.1 సాఫ్ట్‌వేర్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

Advertisement

ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం రెడ్‌మీ నోట్ 17 5Gలో అద్భుతమైన కెమెరాలను ఇస్తున్నారు. దీని వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది 50M కెమెరా. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటం వల్ల చేతులు కాస్త వణికినా ఫొటోలు, వీడియోలు బ్లర్ అవ్వకుండా చాలా షార్ప్‌గా వస్తాయి. దీనితో పాటు ల్యాండ్‌స్కేప్ ఫొటోల కోసం 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఇస్తున్నారు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉండబోతోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నెంబర్ 2607DRA18T అని లీకైంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌పై ఇంటర్నల్ టెస్టింగ్స్ జరుపుతున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే దీని లాంచ్ డేట్, అసలు ధర ఎంత అనే విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునేలా తక్కువ ధరలోనే ఈ ప్రీమియం ఫీచర్లను రెడ్‌మి అందించనుండటంతో మార్కెట్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: ఒప్పో షాకింగ్ నిర్ణయం.. ఆ ప్రీమియం ఫోన్‌పై ఏకంగా రూ.64,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×