E-Paper
Advertisement

Redmi Note 15 5G: రెడ్‌మీ డబుల్ ధమాకా.. భారత మార్కెట్లో రెడ్‌మీ నోట్ 15, రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో గ్రాండ్ లాంచ్!

Redmi Note 15 5G: రెడ్‌మీ డబుల్ ధమాకా.. భారత మార్కెట్లో రెడ్‌మీ నోట్ 15, రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో గ్రాండ్ లాంచ్!
Advertisement

Redmi Note 15 5G: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రెడ్‌మీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లో విడుదలైంది. ఈ క్రమంలో మిడ్‌‌రేంజ్‌ సెగ్మెంట్‌లో Redme Note 15ను తీసుకొచ్చింది. Redme Note 14కి కొనసాగింపుగా వచ్చిన ఈ హ్యాండ్ సెట్ 108MP కెమెరాతో యూజర్లను ఆకట్టుకోనుంది. దీంతో పాటు Redmi Pad 2 Proను కూడా లాంచ్ చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌లో ఈ గ్యాడ్జెట్ల వివరాలను వెల్లడించారు.

ఆరేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్:

ఈ Redme Note 15 5G స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారిత హైపర్‌ OS 2తో విడుదల చేసింది. అలాగే ఈ ఫోన్‌కు 4 ఏళ్లపాటు OS అప్‌డేట్స్‌, 6 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని సంస్థ తెలిపింది. అయితే త్వరలోనే ఆండ్రాయిడ్ 16తో కూడిన హైపర్‌ OS 3 అప్డేట్ చేస్తామని రెడ్‌మీ ప్రకటించింది. రెడ్‌మీ నోట్ 15 ఫోన్.. 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటుతో, 3200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వచ్చింది.

108 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా:

Advertisement

ఇకపోతే ఈ ఫోన్‌కు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌, స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 3 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనిలో 108MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, అలాగే 20MP ఫ్రంట్‌ కెమెరాను అమర్చారు. IP65తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ సదుపాయం కలదు. అలాగే AI ఫేస్‌ అన్‌లాక్‌, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. 5520mah బ్యాటరీ లైఫ్‌ కలిగి ఉన్న ఈ ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో మద్దతు ఇస్తుంది. అలాగే 18W రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంటుంది.

రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్:

రెడ్‌మీ నోట్ 15 సిరీస్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB+ 128GB స్టోరేజీ కలిగిన హ్యాండ్ సెట్‌ ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్‌తో రూ.19,999కు సొంతం చేసుకోవచ్చు. ఇక 256GB వేరియంట్‌ బ్యాంక్ ఆఫర్‌ తర్వాత రూ.21,999కు లభిస్తుంది. Axis బ్యాంక్‌, ICICI, SBI కార్డుదారులు రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రెండు నెలల యూట్యూబ్‌ ప్రీమియం, మూడు నెలల స్పాటిఫై, ఆరు నెలలు గూగుల్‌ వన్‌ సదుపాయాన్ని ఫ్రీగా ఆస్వాదించవచ్చు. రెడ్‌మీ నోట్ 15 సిరీస్ ఈనెల 9వ తేదీ నుంచి విక్రయానికి వస్తాయి.

బిగ్ బ్యాటరీతో Redme Pad 2 Pro:

Advertisement

Redme Note 15తో పాటు Redme Pad 2 Proను కూడా సంస్థ విడుదల చేసింది. 12.10 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ప్యాడ్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జన్‌4 ప్రాసెసర్‌ను‌ అమర్చారు. ముందూ వెనుక 8+8MP కెమెరాలు, 12000mah బ్యాటరీ ఉంటుంది. ఈ ప్యాడ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ధర విషయానికి వస్తే..

8GB+ 128GB స్టోరేజీతో కూడిన Wi-Fi ఓన్లీ వేరియంట్‌ ధర రూ.22,999గా, ఇదే స్టోరేజీతో Wi-Fi+ 5G కనెక్టివిటీ కలిగిన ప్యాడ్‌ ధరను రూ.25,999గా, అలాగే 256GB స్టోరేజీ కలిగిన Wi-Fi+ 5G మోడల్‌ ధరను రూ.27,999గా కంపెనీ నిర్ణయించింది. Redme Pad 2 Proను Axis బ్యాంక్‌, SBU, ICICI బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. సుమారు రూ.2,000 తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈనెల 12 నుంచి వీటి కొనుగోళ్లు ప్రారంభమం అవుతాయని కంపెనీ ప్రకటించింది.

 

 

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×