E-Paper
Advertisement

Redmi Next 5G: రెండు రోజులు ఛార్జింగ్ ఆలోచనే అవసరం లేదు.. 9000mah బ్యాటరీతో వస్తున్న రెడీమి నెక్స్ట్ 5జి

Redmi Next 5G: రెండు రోజులు ఛార్జింగ్ ఆలోచనే అవసరం లేదు.. 9000mah బ్యాటరీతో వస్తున్న రెడీమి నెక్స్ట్ 5జి
Advertisement

Redmi Next 5G: రెడ్‌ మీ నుంచి రాబోతోన్న నెక్స్ట్ లెవెల్ 5జీ పవర్‌హౌస్ పై చైనా లీక్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. గతంలో వచ్చిన రెడ్ మీ టర్బో 4 ప్రో, పోకో ఎఫ్7 వంటి మోడల్స్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 శక్తితో మార్కెట్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేశాయి. ఇప్పుడు అదే చిప్‌తో కొత్త రెడ్మీ మోడల్ రాబోతోందనే సమాచారం రావడంతో టెక్ ప్రేమికులు, గేమింగ్ యూజర్లు, పవర్ యూజర్లు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ డివైస్ ప్రత్యేకత ఏమిటి? ఏమి కొత్తగా ఫీచర్లు వున్నాయి? ఏ ధరకు రాబోతోంది? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అప్‌డేటెడ్ లుక్‌పై ఫోకస్

Advertisement

డిజైన్ విషయానికి వస్తే రెడ్‌మీ ఈసారి అప్‌డేటెడ్ లుక్‌పై బాగా ఫోకస్ పెట్టింది. చాలా స్లిమ్ ఫ్రేమ్, స్మూత్ ఫ్లాట్ ఎడ్జ్‌లు, చేతిలో పట్టుకున్నా ప్రీమియం ఫీల్ వచ్చేలా మెటల్ బాడీ స్టైల్, పలుచని బెజెల్స్ అనే అంశాలు లీక్స్‌లో కనిపిస్తున్నాయి. ప్రతి రెడ్‌మీ మోడల్‌లో గత రెండు సంవత్సరాలుగా డిజైన్ వైపు పెద్ద మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా కొత్త కలర్ వేరియంట్స్, సింపుల్ క్లీన్ స్టైల్ తో మంచి ఆకర్షణీయంగా ఉండబోతోంది.

ఒఎల్ఈడి స్క్రీన్

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే ఇది పెద్ద హైలైట్. 6.78 అంగుళాల 1.5కే రెజల్యూషన్ ఫ్లాట్ ఒఎల్ఈడి స్క్రీన్ ఇవ్వబోతున్నారని సమాచారం. పెద్ద స్క్రీన్ కావడంతో వీడియోలు, వెబ్ బ్రౌజింగ్, గేమింగ్ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి స్క్రోలింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. ఫ్లాట్ స్క్రీన్ అంటే ప్రోటెక్టర్ పెట్టడం సులభం, డ్యామేజ్ అయితే రీప్లేస్ ఖర్చు తక్కువ, అందుకే చాలా మందికి ఇది ఫేవరెట్.

డ్యూయల్ కెమెరా మాడ్యూల్

కెమెరా విషయానికి వస్తే అధికారిక కన్ఫర్మేషన్ లేనప్పటికీ డ్యూయల్ కెమెరా మాడ్యూల్ తో రావొచ్చనే లీక్ ఉంది. ప్రైమరీ కెమెరా మంచి పనితీరు ఇవ్వడానికి పెద్ద సెన్సార్ ఉపయోగించే అవకాశం ఉంది. రెడ్ మీ సాధారణంగా ఇమేజ్ ప్రోసెసింగ్‌లో మంచి ఆప్టిమైజేషన్ ఇస్తుంది కాబట్టి డే-లైట్ షాట్స్, వీడియో స్టెబిలిటీ, నైట్ ఫోటోలు అన్నీ కూడా బ్యాలెన్స్‌డ్ అవ్వొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చే సరికి సోషల్ మీడియా యూజర్లకు సరిపడే క్వాలిటీ ఇవ్వనుందనే ఆశ ఉంది.

Also Read: Samsung Galaxy A101 6G: శామ్‌సంగ్ గెలాక్సీఏ101 6జి లాంచ్ టైమ్ ఫిక్స్.. ఎంట్రీకి ముందే ధర లీక్..

గేమర్స్‌కు పండగే..

పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది అసలు ఈ ఫోన్ యొక్క మాస్టర్ స్ట్రోక్. ఇందులో ఉండబోయేది స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్. టీఎస్‌ఎమ్‌సీ 4ఎన్‌ఎం టెక్నాలజీతో తయారయ్యందున స్పీడ్, గ్రాఫిక్స్, గేమింగ్ పర్‌ఫార్మెన్స్, హీట్ కంట్రోల్ అన్నీ కూడా అత్యున్నత స్థాయిలో ఉంటాయి. హెవీ యాప్‌లు, రామ్ మేనేజ్‌మెంట్, మల్టిటాస్కింగ్ అన్నీ కూడా ఎలాంటి స్టట్టర్స్ లేకుండా స్మూత్ గా నడుస్తాయి. పబ్జీ, బిజిఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీఫైర్ వంటి భారీ గేమ్స్ కూడా హై సెట్టింగ్స్‌లో ఆడొచ్చు.

9000ఎం‌ఏహెచ్ భారీ బ్యాటరీ పవర్

బ్యాటరీ విషయానికి వస్తే ఇదే ఈ ఫోన్ వస్తున్న పెద్ద షాకింగ్ ఫీచర్. 9000ఎం‌ఏహెచ్ భారీ బ్యాటరీ పవర్ రాబోతుందని చైనా లీక్స్ చెబుతున్నాయి. ఈ స్థాయి బ్యాటరీ మిడ్ రేంజ్ లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే రెండు రోజుల పాటు కూడా టెన్షన్ లేకుండా హేవీ యూజ్ సపోర్ట్ ఇవ్వొచ్చు. ఫాస్ట్ చార్జింగ్ కూడా ఎక్కువ వాట్టేజ్ లో ఉండే అవకాశం ఉన్నందున ఛార్జింగ్ సమయం కూడా తక్కువ అయ్యే అవకాశమే ఎక్కువ.

కొత్త హైపర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చే సరికి రెడ్ మీ కొత్త హైపర్ ఓఎస్ ఇవ్వబోతుందని సమాచారం. మరింత స్మూత్ యానిమేషన్స్, మెరుగైన యాప్ ఆప్టిమైజేషన్, బ్యాటరీ మేనేజ్‌మెంట్, హీట్ కంట్రోల్ వంటి అంశాల్లో ఇది మంచి సపోర్ట్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ మీదనే రన్ అవుతుందని పెద్దగా అంచనా.

ఇండియాలో ధర.. లాంచింగ్ డేట్?

ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అసలు ప్రశ్న ఇండియాలో ధర, లాంచ్ ఎప్పుడు? లీకుల ప్రకారం ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో రావచ్చు. ధర సుమారు 23వేల నుంచి 28వేల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. చైనాలో ముందుగా ప్రకటించి తర్వాత ఇండియాలో మార్చి లేదా ఏప్రిల్ మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. రెడ్ మీ ఈసారి మిడ్ రేంజ్ మార్కెట్‌ని పూర్తిగా కదిలించే అవకాశం ఉంది. పోటీ బ్రాండ్స్ కి ఇది పెద్ద ఛాలెంజ్ అవుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×