E-Paper
Advertisement

చీప్ ధరలో Ultra లెవెల్ ఫోన్.. రెడ్‌మీ దెబ్బకు మిగతా బ్రాండ్స్ షేక్, ఫీచర్లు చూశారంటే..

చీప్ ధరలో Ultra లెవెల్ ఫోన్.. రెడ్‌మీ దెబ్బకు మిగతా బ్రాండ్స్ షేక్, ఫీచర్లు చూశారంటే..
Advertisement

Redmi K90 Ultra: రెడ్‌మీ ఫోన్లకు ఇండియన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఈ సంస్థ నుంచి సరికొత్త గేమింగ్ పవర్‌హౌస్‌ మార్కెట్లోకి వచ్చింది. చైనాలో ‘రెడ్‌మి K90 అల్ట్రా’ పేరుతో ఈ ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అద్భుతమైన డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చిన ఈ హ్యాండ్ సెట్ టెక్ లవర్స్‌ను, ముఖ్యంగా గేమర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

ఏయే రంగుల్లో అంటే..

రెడ్‌మీ K90 అల్ట్రా బేస్ వేరియంట్ (12GB+256GB, 16GB+256GB) ధర చైనాలో దాదాపు రూ.40,000గా ఉంది. అలాగే టాప్ మోడల్ (16GB+512GB) ధర సుమారు రూ.50,000 వరకు ఉంటుంది. ఈ ఫోన్ స్పేస్ సిల్వర్, షాడో బ్లాక్, స్కై బ్లూ లాంటి మూడు ట్రెండీ కలర్స్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Also Read: కేక పుట్టించే కెమెరా, భారీ బ్యాటరీ.. రూ.30,000 లోపు దొరికే బెస్ట్ ఫోన్లు ఇవే!

మెరుగైన పనితీరు:

ఈ ఫోన్‌లో 6.83 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 165Hz రీఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. కాబట్టి.. స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. ఇక పనితీరు విషయానికి వస్తే.. దీనిలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి తోడు గేమింగ్ గ్రాఫిక్స్ పెంచడం కోసం ప్రత్యేకంగా D2 AI చిప్‌ను కూడా అమర్చారు.

ఫోన్ లోపలే కూలింగ్ ప్యాడ్:

Advertisement

ఎక్కువగా గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ఒక యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను ఇచ్చారు. ఇది కేవలం 100 సెకన్లలో ఫోన్ వేడిని 10 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. ఇక కెమెరాల పరంగా చూస్తే.. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

భారీ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్:

Redmi K90 Ultra ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. దీనిలో ఏకంగా 8,550mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే 100W GaN ఛార్జర్‌ను కూడా ఇస్తున్నారు. ఫోన్ ధూళి, నీటి నుండి పాడవకుండా ఉండేందుకు దీనికి IP68 రేటింగ్‌ కూడా ఉంది.

Also Read: ఇలాంటి ఇయర్‌బడ్స్ ఎప్పుడూ చూసుండరు.. చెవికి క్లిప్‌లా తగిలించుకుంటే చాలు, బ్యాటరీ లైఫ్ అద్భుతం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×