E-Paper
Advertisement

Redmi K100 Pro Max: ఈ ఫోన్ ఉంటే ఇక ల్యాప్‌టాప్ అక్కర్లేదు.. 16GB RAM, 1TB స్టోరేజ్‌తో రెడ్‌మీ విశ్వరూపం!

Redmi K100 Pro Max: ఈ ఫోన్ ఉంటే ఇక ల్యాప్‌టాప్ అక్కర్లేదు.. 16GB RAM, 1TB స్టోరేజ్‌తో రెడ్‌మీ విశ్వరూపం!
Advertisement

Redmi K100 Pro Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు అందించే బ్రాండ్‌గా రెడ్‌మీకి మంచి పేరుంది. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ, పెర్ఫార్మెన్స్ పరంగా యాపిల్, శాంం‌సంగ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా ‘రెడ్‌మీ K100 ప్రో మాక్స్’ ఫోన్‌ను సిద్ధం చేస్తోంది. అక్టోబర్‌లో లాంచ్ కానున్న ఈ పవర్‌ఫుల్ మొబైల్ ముఖ్యంగా గేమింగ్, మల్టీటాస్కింగ్ ఇష్టపడే యువతకు బెటర్ ఆప్షన్‌గా నిలవనుంది.

నెక్స్ట్ లెవెల్ ప్రాసెసర్..

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఇది 2nm టెక్నాలజీతో తయారైన అత్యంత వేగవంతమైన ప్రొసెసర్ కావడంతో, భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్‌ను కూడా ఫోన్ అస్సలు వేడెక్కకుండా రన్ చేయగలదు. దీనికి తోడు 16GB LPDDR6 RAM, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉండటం విశేషం. సాధారణంగా మనం ల్యాప్‌టాప్‌లలో చూసే ఈ స్థాయి మెమరీ సామర్థ్యం ఇప్పుడు మొబైల్‌లో అందుబాటులోకి రానుంది.

Advertisement

Also Read: వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ గేమింగ్ ఫోన్.. 165Hz డిస్‌ప్లేతో అరాచకంరా అయ్యా!

అద్భుతమైన కెమెరా సెటప్..

ఇక విజువల్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 2K అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చుతున్నారు. దీనివల్ల వీడియోలు చూస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కలర్స్ చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఫొటోగ్రఫీ లవర్స్ కోసం 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా జోడిస్తున్నారు. తద్వారా ఎంత దూరంలో ఉన్న వస్తువులనైనా అత్యంత స్పష్టతతో ఫొటోలు తీయొచ్చు.

భారత్‌లో లాంచ్ ఎప్పుడు?

Advertisement

ఈ ఫోన్ ఇండియాలోకి Poco F9 Ultra పేరుతో వచ్చే అవకాశం ఉందని సమాచారం. చైనాలో ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అవుతుందని, మన దేశానికి వచ్చేసరికి 2027 ప్రారంభం కావచ్చు. ఫీచర్లను బట్టి చూస్తే ధర కాస్త ఎక్కువే ఉన్నా, ఒక పర్‌ఫెక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోరుకునే వారికి ఇదొక బెస్ట్ ఎంపిక అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: మళ్లీ వచ్చేస్తోంది అమెజాన్ ట్రాన్స్‌ఫార్మర్.. ఈ ఏఐ ఫోన్‌లో యాప్స్ అక్కర్లేదు!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×