E-Paper
Advertisement

Redmi Phones: షావోమీ బడ్జెట్ ఫోన్లు.. నిజంగా బాగున్నాయ్ మాష్టారు.. హై రేంజ్ ఫీచర్లు చాలా తక్కువ ధరలో!

Redmi Phones: షావోమీ బడ్జెట్ ఫోన్లు.. నిజంగా బాగున్నాయ్ మాష్టారు.. హై రేంజ్ ఫీచర్లు చాలా తక్కువ ధరలో!
Advertisement

Redmi Phones: చైనీస్ టెక్ కంపెనీ షావోమీ (Xiaomi)కి భారత్ లోనూ మంచి గుడ్ విల్ ఉంది. తక్కువ ధరలో అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న పేరు ఈ చైనా కంపెనీకి ఉంది. ఈ క్రమంలోనే షావోమి తన బడ్జెట్ సిరీస్ లో భాగంగా Redmi A7, Redmi A7 Pro స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఈ ఫోన్లు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ ఫోన్ల ప్రధాన ఫీచర్లు ఏంటి? ధర ఎంత? వంటి విశేషాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

క్వాలిటీ డిస్‌ప్లే, అట్రాక్టివ్ డిజైన్

షావోమీ కొత్తగా తీసుకొచ్చిన Redmi A7 మోడల్.. 6.88 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండగా.. Redmi A7 Pro మోడల్ కొంచెం పెద్దదైన 6.9 అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది. ఈ రెండు ఫోన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. కాబట్టి చాలా స్మూత్ పర్ ఫార్మెన్స్ ను ఈ ఫోన్ అందిస్తుంది. కళ్ల రక్షణకు భరోసా ఇచ్చే.. TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైతం ఈ ఫోన్లకు ఉండటం విశేషం.

ప్రాసెసర్.. పనితీరు

Advertisement

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో శక్తివంతమైన Unisoc T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది మెుబైల్లో రోజువారీ పనులను వేగంగా చేయడానికి, మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు Redmi A7 వేరియంట్ ను 3GB ర్యామ్‌తో.. Pro వేరియంట్ ను 4GB ర్యామ్‌తో షావోమీ అందిస్తోంది.

కెమెరా క్వాలిటీ

కెమెరా విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్లలోనూ వెనుకవైపు 13MP AI కెమెరాను ఫిక్స్ చేశారు. ఇది వింటేజ్ ఫిల్టర్లు, నైట్ మోడ్, డాక్యుమెంట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మెుబైల్ ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు.

బ్యాటరీ సెటప్..

Advertisement

బ్యాటరీ పరంగా ఈ రెండు ఫోన్ల మధ్య వ్యత్యాసం ఉంది. Redmi A7 మోడల్ 5200mAh బ్యాటరీని కలిగి ఉండగా, Redmi A7 Pro మోడల్ భారీ 6300mAh బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు ఫోన్లు 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా వీటిలో 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్, అదనపు ఫీచర్లు

ఈ ఫోన్ల సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. Redmi A7 ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పై వర్క్ చేస్తుంది. అయితే Redmi A7 Pro మోడల్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో వచ్చింది. ఈ రెడ్ మీ ఫోన్లలో సేఫ్టీ కోసం.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ అందించారు. అలాగే దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP52 రేటింగ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి సదుపాయాలు కూడా ఈ ఫోన్లకు అందించారు.

Also Read: డ్రెస్సింగ్ రూమ్ నుంచే హార్దిక్ పాండ్యా ఫ్లయింగ్ కిస్సులు..ఇక వీడికి బుద్ది రాదంటూ

ఇంతకీ ధర ఎంతంటే?

షావోమీ తన కొత్త బడ్జెట్ ఫోన్ల ధరలను ఇప్పటికే నిర్ణయించింది. Redmi A7 (3GB + 64GB) వేరియంట్ ను రూ.10,449, Redmi A7 Pro (4GB + 64GB) రూ.11,499కి ఆఫర్ చేస్తోంది. షావోమీ అధికారిక వెబ్ సైట్, యాప్ తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read: తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×