E-Paper
Advertisement

Redmi 15A 5G: ఐఫోన్ రేంజ్ డిజైన్, పరవ్‌ఫుల్ బ్యాటరీ.. ‘రెడ్‌మి 15A 5G’ లాంచ్ ఎప్పుడంటే?

Redmi 15A 5G: ఐఫోన్ రేంజ్ డిజైన్, పరవ్‌ఫుల్ బ్యాటరీ.. ‘రెడ్‌మి 15A 5G’ లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Redmi 15A 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగి ఉండే ఫోన్ ఏది అంటే.. చాలామంది యూజర్లు రెడ్‌మి గురించే చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి వారందరి కోసం ‘రెడ్‌మి 15A 5G’ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్లు, వివరాలు చూస్తుంటే ఈసారి రెడ్‌మి గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

చూడగానే నచ్చేసే డిజైన్..

ఈ ఫోన్ లుక్ చూడటానికి సింపుల్‌గా, క్లాసీగా ఉంది. వెనుక వైపు ప్లాట్‌గా ఉండి, రెండు కెమెరాలు, ఒక ఫ్లాష్‌తో కూడిన కెమెరా సెటప్ ఇచ్చారు. బాటమ్ లెఫ్ట్ సైడ్‌లో రెడ్‌మి బ్రాండింగ్ ఉంటుంది. ఇక కలర్స్ విషయానికొస్తే.. పింక్ వేరియంట్ చాలా స్పెషల్‌గా ఉంది. అలాగే ఎప్పటిలాగే బ్లాక్, బ్లూ కలర్స్ కూడా స్టైలిష్‌గా ఉన్నాయి.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో ‘ఒప్పో K14 5G’పై తొలి సేల్ మొదలైంది.. ఈ క్రేజీ ఆఫర్లను మిస్ అవ్వకండి!

భారీ బ్యాటరీ సామర్థ్యం..

ఫోన్ వాడేటప్పుడు స్క్రీన్ స్మూత్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకే దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను ఇస్తున్నారు. దీంతో రీల్స్ స్క్రోలింగ్ గానీ, వీడియోలు చూడటం గానీ బాగుంటుంది. ఇక బ్యాటరీ పరంగా చూస్తూ.. ఈ ఫోన్‌లో 6,300mAh భారీ బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు.

మెరుగైన పనితీరు..

Advertisement

ఫొటోల కోసం ఈ రెడ్‌మి 15A 5G ఫోన్‌లో 32MP మెయిన్ కెమెరా ఇచ్చారు. దీంతో సెల్ఫీలు, ఫొటోలు డీసెంట్‌గా వస్తాయి. ఇక ఇది ఒక 5G ఫోన్ కాబట్టి, ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఎలాంటి డోకా ఉండదు. అలాగే దీనిలో పవర్‌ఫుల్ ఆక్టాకోర్ చిప్‌సెట్‌ను వాడుతున్నారు. దీంతో ఫోన్ పనితీరు వేగంగా ఉంటుంది.

ధర ఎంత ఉండొచ్చు?

గత ఏడాది వచ్చిన రెడ్‌మి 15 5G ధర దాదాపు రూ.15,000 వరకు ఉంది. కానీ, ఈ కొత్త రెడ్‌మి 15A 5G దానికంటే తక్కువ ధరకే, అంటే సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్‌లోనే వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో మంచి 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

Also Read: పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. Wi-Fi స్పీడ్‌ను పెంచుకోవచ్చు, అదెలాగంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×