// // Red Magic Tablet 5 Pro: కూలింగ్ ఫ్యాన్‌తో గేమింగ్ టాబ్లెట్.. ధర ఎంతంటే? -->
E-Paper
Advertisement

ల్యాప్‌టాప్‌ను మించిన పెర్ఫార్మెన్స్.. 185Hz డిస్‌ప్లేతో వస్తున్న Red Magic 5 Pro Tablet!

ల్యాప్‌టాప్‌ను మించిన పెర్ఫార్మెన్స్.. 185Hz డిస్‌ప్లేతో వస్తున్న Red Magic 5 Pro Tablet!
Advertisement

Red Magic Tablet 5 Pro: మొబైల్ గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ప్రముఖ టెక్ సంస్థ రెడ్ మ్యాజిక్ సిద్ధమైంది. తమ సరికొత్త గేమింగ్ టాబ్లెట్ ‘రెడ్ మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో’ను జూన్ 30న చైనా మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ టాబ్లెట్‌కు సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లను లీక్ చేస్తూ కంపెనీ అంచనాలను పెంచేసింది. మార్కెట్లో ఉన్న లెనోవో లీజియన్ ట్యాబ్ జెన్ 5 వంటి పవర్‌ఫుల్ డివైజ్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

అదిరిపోయే ఆడియో:

ఈ సరికొత్త గేమింగ్ టాబ్లెట్‌లో డిస్‌ప్లే హైలైట్‌గా నిలవనుంది. దీనిలో 9.06 ఇంచుల OLED స్క్రీన్‌ను అందించారు. ఇది ఏకంగా 185Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. దీంతో గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇందులో ఇచ్చారు. అంతేకాదు.. గేమింగ్ ఆడేటప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ కోసం డీటీఎస్ ఎక్స్ ఆల్ట్రా 3డీ ఆడియో సపోర్ట్‌ను కూడా చేర్చారు.

ల్యాప్ టాప్ రేంజ్ పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది భారీ గేమ్స్‌ను కూడా ఎలాంటి లాగ్ లేకుండా రన్ చేస్తుంది. సాధారణంగా ఎక్కువ సమయం గేమ్స్ ఆడితే డివైజ్ వేడెక్కుతుంది. కానీ దీనిలో ప్రత్యేకమైన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో పాటు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను అమర్చారు. తద్వారా టాబ్లెట్ అస్సలు హీట్ అవ్వదు. అంతేకాదు, పీసీ గేమ్స్ ఆడుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక ఎమ్యులేటర్‌ను కూడా ఇందులో ముందే ఇన్‌స్టాల్ చేసి ఇస్తున్నారు.

Also Read: Xiaomi 18లో 4 ఇంచ్ బ్యాక్ డిస్‌ప్లే.. Vivo X500లో కాంపాక్ట్ డిజైన్.. లీకైన రెండు క్రేజీ ఫోన్ల ఫీచర్లు!

డ్యూయల్ యూఎస్‌బీ పోర్ట్స్:

Advertisement

ఎంత ఆడినా ఛార్జింగ్ అయిపోకూడదనే ఉద్దేశంతో 8300mAh భారీ బ్యాటరీని దీనిలో అమర్చారు. అలాగే ఈ ట్యాబ్‌ను వేగంగా ఛార్జ్ చేయడానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇందులో మరో వినూత్నమైన ఫీచర్ ఏమిటంటే.. రెండు యూఎస్‌బీ టైప్-సి పోర్టులు ఉన్నాయి. వీటి ద్వారా టాబ్లెట్‌ను ఛార్జ్ చేసుకోవడమే కాకుండా, పవర్ బ్యాంక్‌లా వాడుతూ ఇతర డివైజ్‌లకు కూడా ఛార్జింగ్ ఇచ్చుకోవచ్చు.

ధర వివరాలు ఇలా:

ప్రస్తుతానికి ఈ టాబ్లెట్ ధరపై కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అంచనాల ప్రకారం దీని ధర రూ.55,500 ఉండే అవకాశం ఉంది. మొదటగా ఇది చైనాలో విడుదల కానుండగా, గ్లోబల్ మార్కెట్, భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే విషయాలు జూన్ 30న జరిగే లాంచ్ ఈవెంట్‌లో పూర్తిగా తెలిసే అవకాశం ఉంది.

Also Read: మునుపెన్నడూ లేని బిగ్ స్క్రీన్‌తో ఎంట్రీ ఇవ్వనున్న iQOO 16T.. లీకైన పూర్తి వివరాలు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×