E-Paper
Advertisement

ఆపిల్ వాచ్ రేంజ్ ఫీచర్లు బడ్జెట్ ధరలో! 20 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రియల్మీ వాచ్

ఆపిల్ వాచ్ రేంజ్ ఫీచర్లు బడ్జెట్ ధరలో! 20 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రియల్మీ వాచ్
Advertisement

Realme Watch S5 Specs: ఈ రోజుల్లో చేతికి స్మార్ట్‌వాచ్ లేకపోతే ఏదో వెలితిగా ఉంటోంది కదూ. అందుకే ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్మీ, మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో రియల్మీ వాచ్ S5ని గ్రాండ్‌గా లాంచ్ చేసింది. అదిరిపోయే ప్రీమియం అల్యూమినియం అలాయ్ డిజైన్, కంటికి ఇంపైన 1.43-ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, అన్నింటికీ మించి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 20 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా పని చేసే అల్ట్రా బ్యాటరీ లైఫ్‌తో ఈ వాచ్ టెక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్ విశేషాలు మీకోసం.

అల్టిమేట్ లుక్.. అన్‌లిమిటెడ్ పవర్:
స్మార్ట్‌వాచ్ అనగానే ప్రతి ఒక్కరూ చూసేది రెండు విషయాలు.. ఒకటి లుక్, రెండు బ్యాటరీ లైఫ్. ఈ రెండింటిలోనూ రియల్మీ వాచ్ ఎస్5 సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం ఈ వాచ్‌ని డిజైన్ చేశారు. రాక్ గ్రే , సాండ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ వాచ్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

Advertisement

క్రిస్టల్ క్లియర్ AMOLED డిస్‌ప్లే:
ఈ వాచ్‌లో 1.43-ఇంచ్ రౌండ్ అమ్ లోడ్ డిస్ ప్లేను అందించారు. ఇది 466×466 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో, 302 PPI డెన్సిటీతో వస్తుంది. దీని వల్ల స్క్రీన్ పైన అక్షరాలు, కలర్స్ చాలా షార్ప్‌గా కనిపిస్తాయి. అంతేకాదు, దీనికి 1500 nits పీక్ బ్రైట్‌నెస్ ఉంది. అంటే మండుటెండలో బయట తిరుగుతున్నా సరే, స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. దీనికున్న ‘అల్వేస్-ఆన్ డిస్‌ప్లే’ (AOD), ‘స్మార్ట్ నైట్ విజన్’ ఫీచర్లు ఈ వాచ్‌కి మరింత రాయల్ లుక్‌ని ఇస్తాయి.

20 డేస్ బ్యాటరీ లైఫ్:
చాలా స్మార్ట్‌వాచ్‌లను ప్రతి రెండు మూడు రోజులకోసారి ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ వాచ్ S5లో ఆ తలనొప్పి లేదు. దీనిలోని 460mAh పవర్‌ఫుల్ బ్యాటరీ, నార్మల్ యూసేజ్‌లో 16 రోజుల వరకు, అదే ‘లైట్ స్మార్ట్ మోడ్’లో ఏకంగా 20 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి ఉన్న మాగ్నెటిక్ ఛార్జర్ కేవలం 2.5 గంటల్లోనే వాచ్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుంది.

Advertisement

ఫోన్ లేకుండానే రూట్ మ్యాప్:
రన్నింగ్, సైక్లింగ్ చేసేవారికి ఇదొక వరం. ఇందులో ఇండిపెండెంట్ 5-సిస్టమ్ GNSS (GPS) సపోర్ట్ ఉంది. అంటే మీరు వాకింగ్ లేదా రన్నింగ్ కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఇంట్లో వదిలేసినా సరే.. మీ రూట్‌ని, డిస్టెన్స్‌ని ఈ వాచ్ చాలా అక్యూరేట్‌గా ట్రాక్ చేస్తుంది.

హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఫీచర్లు:
110+ స్పోర్ట్స్ మోడ్స్: మీరు రన్నింగ్ చేసినా, యోగా చేసినా, బ్యాడ్మింటన్ ఆడినా.. మీ బాడీ యాక్టివిటీని ఇది పక్కాగా రికార్డ్ చేస్తుంది.

ఏఐ హెల్త్ మానిటరింగ్: 24/7 హార్ట్ రేట్ (గుండె వేగం), SpO2 (బ్లడ్ ఆక్సిజన్), స్ట్రెస్ లెవెల్స్ , స్లీప్ (నిద్ర) క్వాలిటీని ట్రాక్ చేస్తుంది.

5ATM వాటర్ రెసిస్టెన్స్: 50 మీటర్ల లోతు వరకు నీటిని తట్టుకోగలదు. కాబట్టి వర్షంలో తడిసినా, స్విమ్మింగ్ చేసినా అస్సలు పాడవదు. తడి చేతులతో కూడా స్క్రీన్‌ని ఆపరేట్ చేయవచ్చు.

స్మార్ట్ బ్లూటూత్ కాలింగ్:
ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్ స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ద్వారా నేరుగా మీ చేతి నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. అలాగే కొత్తగా ‘బ్లూటూత్ ఇంటర్‌కామ్’ ఫీచర్‌ని కూడా ఇందులో ఇచ్చారు.

ధర :
మార్కెట్లో రియల్మీ వాచ్ ఎస్5 ధరను రూ. 7,999 గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్ కింద రూ. 7,499 కే సొంతం చేసుకోవచ్చు. జూన్ 5మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ , రియల్మీ డాట్ కామ్‌లలో ఈ సేల్ ప్రారంభం కానుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×