E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్
Advertisement

Realme Watch S2 Review: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమే కాదు, మన లైఫ్‌స్టైల్‌ని, హెల్త్‌ని ట్రాక్ చేసే ఒక పవర్‌ఫుల్ గ్యాడ్జెట్. ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మీ నుంచి మార్కెట్లోకి వచ్చిన సరి కొత్త realme Watch S2 ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తోంది. బడ్జెట్ ధరలో ప్రీమియం 1.43″ AMOLED డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ సూపర్ ఏఐ ఇంజన్, ఏకంగా 20 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ క్రేజీ స్మార్ట్‌వాచ్ పూర్తి ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

రూ. 3,500 లోపు ఒక ప్రీమియం మెటాలిక్ బాడీ , బెస్ట్ డిస్‌ప్లే ఉన్న వాచ్ కోసం వెతికే వారికి realme Watch S2 ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. దీని ప్రత్యేకతలు..

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్‌లో అందరినీ ఆకట్టుకునే మొదటి విషయం దీని క్లాసీ డిజైన్. ఈ వాచ్‌ను చేతికి పెట్టుకుంటే ఒక క్లాసిక్ అనలాగ్ వాచ్ లుక్ వస్తుంది. దీని గ్రే కలర్ స్ట్రాప్ చాలా ప్రీమియంగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇందులో 1.43 ఇంచుల పవర్‌ఫుల్ డిస్‌ప్లేను అందించారు. దీని బ్రైట్‌నెస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎండలో బయటకు వెళ్లినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పైగా, ఇందులోని ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ వాచ్ స్క్రీన్‌ను ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచి, మరింత మోడ్రన్ లుక్‌ని ఇస్తుంది.

రియల్‌మీ ఈసారి ఈ వాచ్‌లో సరికొత్త సూపర్ ఏఐ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో మీరు మీ వాయిస్ ద్వారానే వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు, మీ మూడ్ . డ్రెస్సింగ్ స్టైల్‌కు మ్యాచ్ అయ్యేలా వందలాది ఏఐ వాచ్ ఫేసెస్ ను ఇది క్షణాల్లో క్రియేట్ చేసి ఇస్తుంది. టెక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్న ఫీచర్ ఇది.

Advertisement

సాధారణంగా అల్మోడ్ డిస్‌ప్లే ఉన్న వాచెస్ బ్యాటరీ 3 లేదా 4 రోజులు మాత్రమే వస్తుంది. కానీవాచ్ లోని ఆప్టిమైజ్డ్ చిప్‌సెట్ ,పవర్‌ఫుల్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ వల్ల నార్మల్ యూసేజ్‌లో ఇది ఏకంగా 20 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడినా కూడా వారం రోజులకు పైగా బ్యాటరీ వస్తుంది. కాబట్టి పదే పదే ఛార్జింగ్ పెట్టే తలనొప్పి ఉండదు.

Also Read: బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

ఇందులో ఇన్-బిల్ట్ మైక్, స్పీకర్ ఉండటం వల్ల మీ ఫోన్ జేబులో ఉన్నా సరే, వాచ్ నుంచే డైరెక్ట్‌గా కాల్స్ మాట్లాడేయొచ్చు. హెల్త్ ఫీచర్స్ విషయానికి వస్తే, 24/7 హార్ట్ రేట్ మానిటర్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి అన్ని ఫీచర్స్ ఇందులో పక్కాగా పనిచేస్తాయి. స్పోర్ట్స్ లవర్స్ కోసం ఇందులో 110+ పైగా స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి.

ధర విషయానికి వస్తే.. ఫీచర్స్ పరంగా ప్రీమియం వాచ్‌లకు గట్టి పోటీ ఇస్తున్న realme Watch S2 ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్స్ , అమెజాన్‌లో కేవలం రూ.3,299 కే లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం బ్రాండ్ వాల్యూ, అదిరిపోయే లుక్ , లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి realme Watch S2 ఒక బెస్ట్ అండ్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్‌వాచ్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×