E-Paper
Advertisement

Realme Watch 5: బట్జెట్ ధరలో స్మార్ట్‌వాచ్ కావాలా.. 16 రోజుల బ్యాటరీ బ్యాకప్, స్టన్నింగ్ ఫీచర్లతో కొత్తవాచ్ లాంచ్!

Realme Watch 5: బట్జెట్ ధరలో స్మార్ట్‌వాచ్ కావాలా.. 16 రోజుల బ్యాటరీ బ్యాకప్, స్టన్నింగ్ ఫీచర్లతో కొత్తవాచ్ లాంచ్!
Advertisement

Realme Watch 5: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ రియల్‌మీ తన కస్టమర్లను ఆకట్టుకునేలా ‘Realme Watch 5’ను లాంచ్ చేసింది. ఈ వాచ్ బిగ్ అమోలేడ్ డిస్‌ప్లే, జీపీఎస్ సిస్టమ్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ Realme P4x 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు విడుదల చేసింది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇదే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడీ స్మార్ట్‌వాచ్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

హెల్త్ ట్రాకర్లు అనేకం:

ఈ వాచ్‌లో అనేక హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ.4,499. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. సంస్థ రూ.500 తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను రూ.3,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ రియల్‌మీ వాచ్ 5 మొదటి సేల్ ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీనిని రియల్‌మీ ఇండియా స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌వాచ్ నలుపు, సిల్వర్, మింట్ బ్లూ, వైబ్రంట్ ఆరెంజ్ కలర్స్‌లో లభిస్తుంది.

Advertisement

Also Read: వారెవ్వా ఏముందీ రెడ్‌మీ స్మార్ట్‌వాచ్.. సింగిల్ ఛార్జ్‌తో 18 రోజులపాటు వాడేసుకోవచ్చు!

యాపిల్ వాచ్‌ను మించిన ఫీచర్లు:

Realme Watch 5.. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.97-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 2D ఫ్లాట్ గ్లాస్ కవర్, మెటాలిక్ యూని-బాడీ డిజైన్‌ను పొందుతుంది. ఈ వాచ్ అల్యూమినియం-అల్లాయ్ ఫంక్షనల్ క్రౌన్‌ను, అలాగే తేనెగూడు స్పీకర్ హోల్, కొత్త 3D వేవ్ స్ట్రాప్‌ను కూడా కలిగి ఉంటుంది.

108 స్పోర్ట్స్ మోడ్‌లు:

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్స్‌ను అందిస్తుంది. అలాగే దీనిలో NFC, 300 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఐదు GNSS వ్యవస్థలతో స్వతంత్ర GPSని కూడా కలిగి ఉంటుంది. అదనంగా ఈ స్మార్ట్‌వాచ్‌లో 108 స్పోర్ట్స్ మోడ్‌లు, గైడెడ్ వర్కౌట్‌లు, స్ట్రెచింగ్ టూల్స్, రియల్‌మీ లింక్ యాప్‌తో ఇంటిగ్రేషన్ ఉన్నాయి. దీంతోపాటు హార్ట్ పల్స్ రేటు ట్రాకింగ్, SpO2, నిద్ర పర్యవేక్షణ, ఒత్తిడి ట్రాకింగ్, పీరియడ్ నిర్వహణను అందిస్తుంది. ఇది మూడు బ్రీతింగ్ ట్రైనింగ్ మోడ్‌లు, మ్యూజిక్ కంట్రోల్, దిక్సూచి, వ్యక్తిగత కోచ్‌ను కూడా అందిస్తుంది. ఇకపోతే.. బ్యాటరీ పరంగా చూసుకుంటే ఈ వాచ్ స్టాండర్డ్ వినియోగంలో 16 రోజుల వరకు, లైట్ మోడ్‌లో 20 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

Also Read: మెటా నుంచి తొలి స్మార్ట్ గ్లాసెస్.. 12MP కెమెరా, 48 గంటల బ్యాటరీ, అధునాతన పీచర్లతో లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×