E-Paper
Advertisement

రియల్‌మీ నుంచి 8000mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో వావ్ అనిపించే ఫీచర్లు!

రియల్‌మీ నుంచి 8000mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో వావ్ అనిపించే ఫీచర్లు!
Advertisement

Realme P4x 4G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి తమ P సిరీస్‌లో సరికొత్త మొబైల్‌ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘రియల్‌మి పి4ఎక్స్ 4జీ’ పేరుతో విడుదలైన ఈ ఫోన్.. ఇదివరకు వచ్చిన 5G మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వచ్చింది. ముఖ్యంగా ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా ఎక్కువ సమయం ఫోన్ వాడాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని డిజైన్ చేసింది.

అదిరిపోయే భారీ బ్యాటరీ:

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే. ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని దీనిలో అందించారు. తద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు మూడు రోజుల వరకు ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు. సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్, కాలింగ్ ఇలా దేనికైనా ఇది బాగా సెట్ అవుతుంది. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు.

డిస్‌ప్లే, సరికొత్త డిజైన్:

Advertisement

ఈ మొబైల్ 6.8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. స్క్రీన్ వాడకం స్మూత్‌గా సాగడం కోసం 120Hz రీఫ్రెష్ రేట్‌ను జోడించారు. ఫోన్ వెనుక భాగంలో సరికొత్త డిజైన్‌తో పాటు ‘ఏఐ పల్స్ లైట్’ ఫీచర్‌ను అందించడం విశేషం. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ బరువు 219 గ్రాములు మాత్రమే ఉండటం వల్ల పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది.

Also Read: ఇంతకంటే తక్కువకు రాదు.. Google Pixel 10పై రూ.29,000 వరకు లాభం పొందే సూపర్ ఛాన్స్!

కెమెరా విషయానికి వస్తే:

Advertisement

ఫొటోల కోసం వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 5MP కెమెరాను ఇచ్చారు. రోజువారీ ఫొటోలకు ఈ కెమెరా బాగానే సెట్ అవుతుంది. అలాగే ఇందులో యూనిసోక్ టి7250 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే వీలుంది.

ధర వివరాలు:

ఈ ఫోన్‌కు ఐపీ64 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం మలేషియా మార్కెట్లో దీని ధర దాదాపు రూ.16,500గా ఉంది. ఇది ఫాంటమ్ నేవీ, ర్యాలీ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. భారత్‌లో దీని లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: ఫోన్ ఓపెన్ చేయక్కర్లేదు.. చేతిపైనే అంతా, పెబుల్ తెచ్చిన ఈ స్మార్ట్ బ్యాండ్ స్పెషాలిటీ ఏమిటంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×