E-Paper
Advertisement

Realme P4 Lite: రూ.7,999కే రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ మావా.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Realme P4 Lite: రూ.7,999కే రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ మావా.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Advertisement

Realme P4 Lite: బెస్ట్ బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా, అదిరిపోయే ఫీచర్లతో Realme P4 Lite ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా ఛార్జింగ్ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొలి. ఇంత తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడీ రియల్‌మీ P4 లైట్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం.

అందుబాటులోకి ఎప్పుడు?

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్ 4GB+64GB అసలు ధర రూ.9,999 ఉండగా, లాంచ్ ఆఫర్లు వినియోగించుకుంటే కేవలం రూ.7,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే 4GB+128GB వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, స్పెషల్ కూపన్ల ద్వారా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మే వెబ్‌సైట్లలో సేల్ ప్రారంభం కానుంది.

Advertisement

Also Read: నోకియా కీప్యాడ్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడొచ్చు!

ఛార్జింగ్ టెన్షన్ ఉండదు:

Realme P4 Liteలో ప్రధాన ఆకర్షణ దీని 6300 mAh భారీ బ్యాటరీ. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. దీనికి తోడు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. బడ్జెట్ ధరలో ఇంతటి పవర్‌ఫుల్ బ్యాటరీ రావడం నిజంగా విశేషం అనే చెప్పవచ్చు.

కలర్ ఆప్షన్స్:

Advertisement

చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తోంది. 90Hz రిఫ్రెష్ రేట్ వల్ల వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ Realme P4 Lite ఫోన్ బీచ్ గోల్డ్, బ్లాక్, సీ బ్లూ వంటి ట్రెండీ రంగుల్లో ఇది లభిస్తోంది.

ఇతర ఫీచర్లు:

ఇక ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 13MP AI మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 5MP కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కూడా అందించారు.

Also Read: రూ.899 నుంచే ఫిలిప్స్ కొత్త హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్స్.. ఫీచర్స్, క్వాలిటీలో తిరుగులేదు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×