E-Paper
Advertisement

Realme P Series: ఇండియా మార్కెట్లోకి మరో రియల్‌మీ బ్యాటరీ బీస్ట్ వచ్చేస్తోంది.. ధర, స్పెసిఫికేషన్లు, కీలక వివరాలు ఇవిగో!

Realme P Series: ఇండియా మార్కెట్లోకి మరో రియల్‌మీ బ్యాటరీ బీస్ట్ వచ్చేస్తోంది.. ధర, స్పెసిఫికేషన్లు, కీలక వివరాలు ఇవిగో!
Advertisement

Realme P Series: ప్రముఖ స్మార్ట్‌పోన్ల తయారీ సంస్థ రియల్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్‌లోకి రానున్నట్టు లీక్స్ చెబుతున్నాయి. గత ఏడాదిలో విడుదలైన Realme P4x 5G తర్వాత, అదే P సిరీస్‌లో కొత్త మోడల్‌ను ఈ నెల చివర్లో లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతున్నట్టు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లోకి ఎప్పుడంటే?

ఈ కొత్త ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. RMX5107 మోడల్ నంబర్‌తో ఉన్న ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ BIS సర్టిఫికేషన్‌ను పొందింది. సాధారణంగా BIS అనుమతి లభించిందంటే.. త్వరలోనే భారత్‌లో లాంచ్ అవుతుందనడానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఈ ఫోన్ జనవరి చివర్లోనే భారత్‌లో అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Also Read: నీటిలో మునిగిపోయినా ఏం ఫర్లేదు.. మార్కెట్‌ను షేక్ చేయనున్న వాటర్‌ప్రూఫ్ మొబైల్స్ ఇవే!

భారీ బ్యాటరీ సామర్థ్యం:

ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన తాజా లీకులు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో భారీ 10,000mAh బ్యాటరీ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది నిజమైతే, ఇప్పటివరకు భారత్‌లో రియల్‌మీ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అవుతుంది. అయితే ఈ విషయంపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ధర వివరాలు ఇలా (అంచనా)..

Advertisement

సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఈ కొత్త Realme P సిరీస్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించిన Realme UI 7.0తో పనిచేయవచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే పనితీరు కోసం 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉండే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ఇకపోతే ఈ ఫోన్ ధర గత ఏడాది విడుదలైన Realme P4x 5G కంటే.. కొంచెం ఎక్కువ ధరలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. Realme P4x 5Gను రూ.15,499 ప్రారంభ ధరతో విడుదల చేశారు. ఆ మోడల్లో 7,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6nm టెక్నాలజీపై తయారైన MediaTek Dimensity 7400 Ultra చిప్‌సెట్ ఉన్నాయి. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా అందించారు.

ఇటీవల విడుదలైన ఈ కొత్త లీకులు నిజమైతే.. రాబోయే Realme P సిరీస్ ఫోన్ బ్యాటరీ బ్యాక్‌అప్ విషయంలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు కంపెనీ నుంచి అధికారిక విడదుల అనౌన్స్‌మెంట్ కోసం టెక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: భారత్‌లో వివో కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు.. ZEISS ట్యూన్డ్ కెమెరాలు, కొత్త OriginOS 6 ఫీచర్లు హైలైట్!

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×