E-Paper
Advertisement

Realme Neo 8: బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. రియల్‌మీ నియో 8 ఫీచర్లు తెలిస్తే ఎగిరి గంతులేస్తారు బాస్!

Realme Neo 8: బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. రియల్‌మీ నియో 8 ఫీచర్లు తెలిస్తే ఎగిరి గంతులేస్తారు బాస్!
Advertisement

Realme Neo 8: ప్రముఖ చైనాకు చెందిన టెక్ సంస్థ రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. Realme Neo 8 పేరుతో త్వరలో చైనాలో విడుదలయ్యే అవకాశం ఉందని తాజా లీక్స్ సూచిస్తున్నాయి. అక్కడ లాంచ్ అయిన కొన్ని రోజులకు Realme GT 8 పేరుతో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ హ్యాండ్ సెట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని అంచనా. దీనికి భారీ 8000mAh బ్యాటరీ ప్యాక్ లభించవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అదే సమంయలో ఈ ఫోన్‌లో 16GB వరకు RAM వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే దీనిలో 4K రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగల ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉండొచ్చని తెలుస్తోంది.

భారత్‌లోకి ఎప్పుడంటే:

Advertisement

Realme Neo 8 ఫోన్ విడుదల తేదీని ప్రస్తుతానికి కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఇది ప్రపంచ, భారతీయ మార్కెట్ల కోసం Realme GT 8గా రీబ్రాండ్ చేయబడిందని మాత్రం తెలుస్తోంది. ఇక భారత్‌లో ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Realme Neo 8 ధర తాజా నివేదిక ప్రకారం.. సుమారు రూ.29,990 నుండి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read: ఇంత తక్కువ ధరకు అంత పెద్ద టీవీనా?.. Acer 40 అంగుళాల Smart TVపై షాకింగ్ డిస్కౌంట్!

స్పెసిఫికేషన్లు:

Advertisement

Realme Neo 8 ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. దీనిలో 50 మెగాపిక్సల్ మెయిన్ సెన్సార్, 12 మెగాపిక్సల్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్‌తో కూడిన 2 మెగాపిక్సల్ టెర్టియరీ సెన్సార్ ఉండనుంది. ఇవి 4K వీడియోల వరకు రికార్డ్ చేయగలవు. అలాగే దీని ముందు భాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా లభించచ్చు. 8000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న రియల్‌మీ నియో 8 ఫోన్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వొచ్చు.

AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే:

రియల్‌మీ నియో 8 ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. దీనికి 120Hz లేదా 165Hz రిఫ్రెష్ రేట్ లభించవచ్చు. ఇది 6000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని చేరుకోగలదు. దీంతో తీవ్రమైన సూర్యరశ్మి పరిస్థితుల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌కు IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు కూడా ఉండవచ్చు. దీనిలో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది.

Infinity Edition వేరియంట్ కూడా:

ఈ హ్యాండ్ సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సంస్థ ఇప్పటికే ధృవీకరించింది. అలాగే ఈ ఫోన్ వెనుక ప్యానెల్ లైవ్ ఫొటోలు కూడా తాజాగా లీకైంది. దీనిలో గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్‌ను చూడొచ్చు. అంతేకాదు ఇన్ఫినిటీ ఎడిషన్ వేరియంట్ కూడా ప్రాసెస్‌లో ఉన్నట్లు లీక్స్ సూచిస్తున్నాయి. ఈ ఫోన్ 16GB వరకు RAM + 1TB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో వస్తుందని అంచనా. ఇది రియల్‌మీ UI 7తో ఆండ్రాయిడ్ 16పై పనిచేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: శాంసంగ్ నుంచి మరో పవర్‌ఫుల్ 5G ఫోన్.. BIS సర్టిఫికేషన్‌తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ కన్ఫర్మ్!

 

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×