E-Paper
Advertisement

Realme Narzo Power 5G: 10,001mAh భారీ బ్యాటరీ, అత్యాధునిక ఫీచర్లతో రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

Realme Narzo Power 5G: 10,001mAh భారీ బ్యాటరీ, అత్యాధునిక ఫీచర్లతో రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?
Advertisement

Realme Narzo Power 5G: బడ్జెట్ ధరలో శక్తివంతమైన బ్యాటరీని కోరుకునే వారి కోసం ప్రముఖ రియల్‌మీ సంస్థ ‘Realme Narzo Power 5G’ని లాంచ్ చేసింది. ఇటీవల విడుదలైన పీ4 పవర్‌ మోడల్ తరహాలోనే, ఇందులో కూడా 10,001mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అమర్చారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ టెక్నాలజీ సాయంతో కేవలం 85 నిమిషాల్లోనే ఫోన్‌ను పూర్తిస్థాయిలో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

మెరుగైన పనితీరు:

ఈ Realme Narzo Power 5G ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మల్టీ టాస్కింగ్‌ను స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 సాఫ్ట్‌వేర్‌పై పనిచేసే ఈ ఫోన్, వినియోగదారులకు లేటెస్ట్ ఫీచర్లను అందిస్తుంది. సుమారు 219 గ్రాముల బరువున్న ఈ స్మార్ట్‌ఫోన్, ఐపీ 66, 68, 69 రేటింగ్‌లతో ధుమ్ము, నీటి నుంచి రక్షణను కలిగి ఉంది.

Advertisement

Also Read: భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్.. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్స్, ఐఫోన్ రేంజ్ డిస్‌ప్లే!

50 మెగాపిక్సెల్ కెమెరా:

ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. 144Hz రిఫ్రెష్ రేటు కలిగిన 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వెనుకవైపు సోనీ IMX882 సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాను అందించారు. దీనికి తోడుగా 8MP, 2MP కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు.

ధర వివరాలు:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ 8GB+128GB ధర రూ.27,999 కాగా, 8GB+256GB మోడల్ ధర రూ.29,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లను వినియోగించుకుంటే బేస్ వేరియంట్‌ను రూ.23,999కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్‌లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

Also Read: మాల్స్, థియేటర్లలో టాయిలెట్ డోర్ల కింద ఆ గ్యాప్ ఎందుకో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×