E-Paper
Advertisement

RealMe Narzo Series: 5G స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.13,999కే రియల్‌మీ నార్జో 90x 5G మీ సొంతం!

RealMe Narzo Series: 5G స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.13,999కే రియల్‌మీ నార్జో 90x 5G మీ సొంతం!
Advertisement

RealMe Narzo Series: బడ్జెట్ సెగ్మెంట్‌లో మరోసారి హీట్ పెంచేందుకు రియల్‌మీ తన నార్జో 90 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా నార్జో 90 5G, నార్జో 90x 5G అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా నార్జో 90x 5G అయితే.. 144Hz హై రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ 7000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, శక్తివంతమైన 50MP కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్లతో రోజువారీ వినియోగం నుంచి గేమింగ్ వరకు అన్నింటికీ మెరుగైన అనుభవాన్ని పొందాలనుకుంటే ఈ ఫోన్‌ను కొనేసుకోండి.

గేమింగ్‌ లవర్స్‌ కోసం:

నార్జో 90x 5G ఫోన్ 6.8 అంగుళాల పెద్ద LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 144Hz హై రీఫ్రెష్ రేట్‌తో రావడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. 720 x 1570 పిక్సల్స్ రిజల్యూషన్‌తో పాటు గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించడం వల్ల బయట వెలుతురులోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా.. IP65 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, వాటర్ నుంచి ఫోన్‌కు రక్షణ లభిస్తుంది.

Advertisement

Also Read: ఆధునిక ఏఐ ఫీచర్లు, టాప్ ప్రొటెక్షన్‌తో మోటోరొలా ఎడ్జ్ 70 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

కొత్త ఫీచర్లు:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6nm టెక్నాలజీపై తయారైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ చిప్‌సెట్ ఉపయోగించారు. రోజువారీ యాప్స్, మల్టీటాస్కింగ్, లైట్ గేమింగ్‌కు ఇది సరైన పనితీరును అందిస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పై పనిచేస్తుంది. దీంతో కొత్త ఫీచర్లు, మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ అనుభవం లభిస్తుంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

నార్జో 90x 5G లో.. ప్రధాన ఆకర్షణగా నిలిచేది దీని 7000mAh భారీ బ్యాటరీ. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు ఫోన్ వాడుకునే అవకాశం ఉంటుంది. దీనికి తోడు 60W వైర్‌డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది.

50 మెగాపిక్సెల్ కెమెరా:

ఇక ఫొటోగ్రఫీ విభాగంలో నార్జో 90x 5G వెనుక భాగంలో 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరాను అమర్చారు. రోజువారీ ఫొటోలు, సోషల్ మీడియా కోసం ఇది సరైన క్వాలిటీని ఇస్తుంది. ముందుభాగంలో ఉన్న 8MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఉపయోగపడుతుంది. ఈ కెమెరాలతో 1080p రిజల్యూషన్‌లో 30fps వద్ద వీడియో రికార్డింగ్ చేయవచ్చు. కనెక్టివిటీ పరంగా WI-FI, బ్లూటూత్ 5.3, GPS వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

అందుబాటులోకి ఎప్పుడు?

భారత మార్కెట్లో.. నార్జో 90x 5G రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999 కాగా.. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ డిసెంబర్ 23 నుంచి రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అమ్మకానికి రానుంది. ఇది ఫ్లాష్ బ్లూ, నిట్రో బ్లూ రంగుల్లో లభిస్తుంది.

నార్జో 90 5G ఫీచర్లు ఇవే:

ఈ సిరీస్‌లోని మరో మోడల్ నార్జో 90 5G కూడా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. దీనిలో 6.57 అంగుళాల ఫుల్ HD AMOLED డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్ అందించారు. 7000mAh బ్యాటరీతో పాటు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రాసెసింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్ ఉపయోగించారు. కెమెరా విభాగంలో వెనుక వైపు 50MP ప్రైమరీ, 2MP మోనోక్రోమ్ సెన్సర్ ఉండగా, ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా ఇవ్వడం విశేషం. ఈ ఫీచర్లతో నార్జో 90 5G వేగవంతమైన పనితీరు, స్మూత్ యూజర్ అనుభవం, మెరుగైన ఫొటోగ్రఫీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Also Read: అమెజాన్‌లో మోటోరొలా ఎడ్జ్ 50 ప్రోపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.18,650 ధర తగ్గింపు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×