E-Paper
Advertisement

Realme Narzo 80 Lite 5G: అత్యుత్తమ బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మీ నార్జో 5G స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.10999 మాత్రమే!

Realme Narzo 80 Lite 5G: అత్యుత్తమ బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మీ నార్జో 5G స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.10999 మాత్రమే!
Advertisement

Realme Narzo 80 Lite 5G: ప్రముఖ టెలికాం కంపెనీ రియల్‌మీ భారత్‌లో ఇటీవలే రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్‌ ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇటీవల బడ్జెట్‌ ధరలో 7000mAh బ్యాటరీతో రియల్‌మి C85 5G ఫోన్‌ విడుదల అయింది. అలాగే డిసెంబరు 4న రియల్‌మి P4x 5G హ్యాండ్‌సెట్ లాంచ్‌ కానుంది. ప్రస్తుతం రూ.10 వేల ధర సెగ్మెంట్‌లో ఆర్మర్‌ షెల్‌ టఫ్‌ బిల్ట్‌ ఫీచర్‌, 6000mAh బ్యాటరీతో Realme Narzo 80 Lite 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.

ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM+ 128GB స్టోరేజీ ధర రూ.10,999, 6GB RAM + 128GB స్టోరేజీ ధర రూ.11,499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ పొందవచ్చు.

కిందపడినా ఏం పర్లేదు:

Advertisement

రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్.. ఆర్మర్‌ షెల్‌ టఫ్‌ బిల్ట్‌ ఫీచర్‌‌తో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ ఫోన్‌లో ఎయిర్‌బ్యాగ్‌ స్టైల్‌ షాక్‌ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఫలితంగా ఒకవేళ పొరపాటున కిందపడినా కూడా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి.

Also Read: మెసేజింగ్ యాప్స్‌కు కేంద్రం ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

Advertisement

ఇకపోతే ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇది 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది.

6000mAh బ్యాటరీ:

కెమెరా విభాగంలోకి వెళ్తే.. 32MP ప్రైమరీ కెమెరా, LED ఫ్లాట్‌ లైట్‌, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. రియల్‌మి నార్జో 80 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 15W వైర్‌ ఛార్జింగ్‌, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో భారీ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌‌గా ఉంది. దీని డిస్‌ప్లే రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ ఉపయోగించుకోవచ్చు.

Realme C85 5G స్మార్ట్‌ఫోన్:

రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్‌పై భారత్‌ మార్కెట్‌లో నుంచి సేల్‌ ప్రారంభమైంది. ఇది 4GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499, 6GB RAM + 128GB స్టోరేజీ ధర రూ.16,999గా ఉంది. అలాగే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.500 డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఈ హ్యాండ్ సెట్ 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌, IP69 ప్రో రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 పైన పనిచేస్తుంది.

ఇక కెమెరా విభాగం పరంగా.. వెనుక వైపు 50MP సోనీ IMX852 కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 45W SuperVOOC వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Also Read: ఏముందీ షియోమీ స్మార్ట్ వాచ్.. 18 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లోకి కొత్త సరుకు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×