E-Paper
Advertisement

రూ.21,000 బడ్జెట్‌లో 48 గంటల బ్యాటరీ బ్యాకప్.. Realme Narzo 100x భారత్‌లోకి వచ్చేసిందోచ్!

రూ.21,000 బడ్జెట్‌లో 48 గంటల బ్యాటరీ బ్యాకప్.. Realme Narzo 100x భారత్‌లోకి వచ్చేసిందోచ్!
Advertisement

Realme Narzo 100x: బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ బ్యాటరీతో మంచి స్మార్ట్‌ఫోన్స్ అందించే ప్రముఖ బ్రాండ్ రియల్‌మీ.. తాజాగా మార్కెట్లోకి Realme Narzo 100x మొబైల్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్ ఫచర్లు కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

సేల్ ప్రారంభం ఎప్పుడంటే?

ఈ ఫోన్ బేస్ వేరియంట్ (4GB + 128GB) ధర రూ.20,999గా ఉంది. అలాగే మిగిలిన రెండు వేరియంట్లు (6GB+128GB, 6GB+256GB) వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 ధరకు లభిస్తాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో జులై 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ల కింద బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్ల ద్వారా కొనుగోలుదారులు రూ.2,500 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు.

48 గంటల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

నార్జో 100ఎక్స్ ఫోన్‌లో అందరినీ ఆకర్షించే ప్రధాన ఫీచర్ దీనిలోని భారీ 8,000mAh బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు రెండు రోజుల పాటు ఇది సులభంగా బ్యాకప్ ఇస్తుంది. దీంతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం. ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి, రోజువారీగా ఫోన్ ఎక్కువగా వాడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

Also Read: పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీ బ్యాకప్.. Motorola Edge 70 Max ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

ఫోన్‌లోనే కూలింగ్ సిస్టమ్:

Advertisement

ఇందులో 6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఇందులో ప్రత్యేకమైన ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 తో పనిచేస్తుంది.

ఏఐ కెమెరా ఫీచర్లు:

ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండగా.. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఫొటోలను మరింత అందంగా మార్చడానికి ఏఐ ఎరేజర్, ఏఐ అన్‌బ్లర్ వంటి అద్భుతమైన ఏఐ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ65 రేటింగ్ మరియు వెనుక భాగంలో ఆకర్షణీయమైన ఏఐ పల్స్ లైట్ ఎల్‌ఈడీ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

Also Read: భారత్‌లోకి Poco సరికొత్త ఫోన్.. ఏకంగా 8000mAh బ్యాటరీతో రచ్చ లేపనున్న M8 Power!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×