E-Paper
Advertisement

Realme GT 8 Pro Launch: డబ్బులు రెడీ చేస్కోండి. రియల్‌మీ జిటి 8 ప్రో లాంచ్.. ఈ ఫోన్ ప్రతీ బ్రాండ్‌కి సవాలే మావ !

Realme GT 8 Pro Launch: డబ్బులు రెడీ చేస్కోండి. రియల్‌మీ జిటి 8 ప్రో లాంచ్.. ఈ ఫోన్ ప్రతీ బ్రాండ్‌కి సవాలే మావ !
Advertisement

Realme GT 8 Pro Launch: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ (Realme) మరో సరికొత్త స్మార్ట్ఫోన్ రియల్‌మజిటి 8 ప్రో (Realme GT 8 Pro) ను ఈరోజు మార్కెట్లో లాంచ్ చేసింది. అక్టోబర్ 21న చైనాలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ ఫోన్ కోసం చాలా రోజులుగా కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. కొద్ది వారాలుగా.. రియల్‌మీ ఇండియాలో దీని ఫీచర్లను విడుదల చేస్తూ మరింత హైప్‌ను పెంచింది. ఇదిలా ఉంటే.. ఈ ఫోన్ హార్డ్‌వేర్, కెమెరా టెక్నాలజీ, మంచి డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది.

Advertisement

ధరలు :

రియల్‌మీ జిటి 8 ప్రో వివిధ ధరల్లో అందుబాటులో ఉంది.

Advertisement

12GB RAM + 256GB స్టోరేజ్ ఉన్నఫోన్ రూ. 72,999 లకు లభిస్తుండగా 16GB RAM + 512GB స్టోరేజ్ ఫోన్ రూ. 78,999, డ్రీమ్ ఎడిషన్ 16GB RAM + 512GB స్టోరేజ్ ఫోన్ రూ. 79,999 కు కొనుగోలు చేయొచ్చు..

ప్రత్యేక ఆఫర్‌లు:

Realme GT 8 Pro నవంబర్ 25న వివిధ ఫ్లాట్ ఫామ్‌లలో విడుదల కానుంది. ఇది Realme వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌లలో లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్‌లు:

ICICI, HDFC, SBI కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లు ఈ ఫోన్‌పై . 5,000 వరకు బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు. అంతే కాకుండా అన్ని మోడల్స్ పై నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. 12 నెలల వరకు వడ్డీ లేని EMI ప్లాన్‌లతో కూడా కొనుగోలు చేయొచ్చు.

ఉచిత డెకో సెట్: రియల్‌మీస్మార్ట్‌ఫోన్‌తో పాటు కస్టమర్లు మార్చుకోగలిగే (స్వాపబుల్) కెమెరా మాడ్యూల్ ప్యానెల్‌లను (‘డెకో సెట్’) కూడా ఉచితంగా అందిస్తోంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:

రియల్‌మీ జిటి 8 ప్రోను మార్కెట్‌లో వివిధ బ్రాండ్‌లకు గట్టి పోటీని తప్పకుండా అందిస్తుంది.

1. డిజైన్, డిస్‌ప్లేడిస్‌ప్లే: ఈ ఫోన్ 6.79-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 7000 nits పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. రియల్‌మీ GT 8 ప్రోను డైరీ వైట్, అర్బన్ బ్లూ రంగులలో అందిస్తోంది. డైరీ వైట్ వేరియంట్ ఫ్రాస్టెడ్ గ్లాస్ ఫినిషింగ్‌ను కలిగి ఉండగా.. అర్బన్ బ్లూ పేపర్-టెక్చర్డ్ వీగన్ లెదర్ బ్యాక్‌ను కలిగి ఉంటుంది. దీనిల ప్రత్యేకంగా కనిపించేది కెమెరా ఐలాండ్.

ఈ ఫోన్ ముందు భాగంలో.. GT 8 Pro 144Hz రిఫ్రెష్ రేట్, 7000 nits వరకు ఎక్కువ బ్రైట్‌నెస్‌తో 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతే కాకుండా 120W వైర్డ్ ఛార్జర్ తో 7000mAh బ్యాటరీ కలిగి ఉంది.

Also Read: రేటు మాత్రం దిమ్మతిరిగేలా ఉంది కానీ.. ఫోన్ చూస్తే సూపర్ మోడల్..

2.రంగులు:  డైరీ వైట్ (ఫ్రాస్టెడ్ గ్లాస్ ఫినిషింగ్), అర్బన్ బ్లూ (పేపర్-టెక్చర్డ్ వీగన్ లెదర్ బ్యాక్) రంగులలో ఈ మోడల్ అందుబాటులో ఉంది.

3. బ్యాటరీ: భారీ 7,000mAh బ్యాటరీ శక్తిని ఈ మోడల్ కలిగి ఉంది.

4. కెమెరా: ఈ సంవత్సరం రియల్‌మీ రికో సహకారం ద్వారా కెమెరా అప్‌గ్రేడ్‌లపై దృష్టి పెడుతోంది. GT 8 ప్రోలో 50MP మెయిన్ కెమెరా, 200MP టెలిఫోటో లెన్స్ , 50MP అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. అంతే కాకుండా కెమెరా సిస్టమ్ కొత్త రికో GR మోడ్‌ను కలిగి ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×