E-Paper
Advertisement

Realme C83 5G: రూ.13,499కే 7,000mAh బ్యాటరీ ఫోన్.. 144Hz డిస్‌ప్లేతో రియల్‌మీ C83 5G లాంచ్!

Realme C83 5G: రూ.13,499కే 7,000mAh బ్యాటరీ ఫోన్.. 144Hz డిస్‌ప్లేతో రియల్‌మీ C83 5G లాంచ్!
Advertisement

Realme C83 5G: ప్రముఖ చైనా బ్రాండ్ రియల్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన పాపులర్ C సిరీస్‌లో భాగంగా Realme C83 5Gని కంపెనీ తాజాగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ వివరాలు మీకోసం..

స్టైలిష్ లుక్..

ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ (4GB+64GB) ధర రూ.13,499 కాగా, 4GB+128GB మోడల్ ధర రూ.14,499గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ (6GB+128GB)ని రూ.17,499కు సొంతం చేసుకోవచ్చు. మార్చి 7 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. బ్లూమింగ్ పర్పుల్, స్ప్రౌటింగ్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది.

Advertisement

Also Read: 10,001mAh భారీ బ్యాటరీ, అత్యాధునిక ఫీచర్లతో రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

మెరుగైన పనితీరు..

ఈ Realme C83 5G ఫోన్‌ 6.8 అంగుళాల భారీ LCD స్క్రీన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను వాడారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతుంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాను, ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఫొటోల కన్నా బ్యాటరీ బ్యాకప్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. Realme C83 5Gలో ఏకంగా 7,000mAh టైటాన్ బ్యాటరీ ఉంది. దీనికి తోడు 15W ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చు.

Also Read: భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్.. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్స్, ఐఫోన్ రేంజ్ డిస్‌ప్లే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×