E-Paper
Advertisement

Realme Buds Clip: నాయిస్ క్యాన్సిలేషన్ AI ఇయర్ బడ్స్.. మీరు ఊహించనంత తక్కువ ధరకే వచ్చేస్తోంది!

Realme Buds Clip: నాయిస్ క్యాన్సిలేషన్ AI ఇయర్ బడ్స్.. మీరు ఊహించనంత తక్కువ ధరకే వచ్చేస్తోంది!
Advertisement

Realme Buds Clip: భారతదేశంలో కొంతకాలంగా ఆదరణ పొందుతున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ.. తమ వినియోగదారులు మెరుగైన అనుభూతిని పొందేందుకు ప్రత్యేక ఫీచర్లు కలిగిన మొబైల్స్‌తో పాటు రకరకాల పరికరాలను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే, త్వరలో రియల్‌మీ నుంచి ‘బడ్స్ క్లిప్ ఓపెన్ ఇయర్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్’ను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు రియల్‌మీ సంస్థ తెలిపింది. ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో వీటిని చూడొచ్చు. మార్కెట్లోకి రానున్న ఈ సరికొత్త ఇయర్ బడ్స్ ఫీచర్లు, టెక్నాలజీ, ధర వంటి వివరాల్లోకి వెళితే..

ఏఐ ఆధారిత టెక్నాలజీ:

త్వరలో మార్కెట్‌లోకి రానున్న ఈ రియల్‌మీ బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్.. రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఒకటి టైటానియం బ్లాక్ కాగా.. రెండోది టైటానియం గోల్డ్. వీటి ధరను రూ.5,315గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిలో11mm డ్యూయల్-మాగ్నెట్ స్పీకర్ యూనిట్‌ ఉంటుందని రియల్‌మీ పేర్కొంది. ఫోన్ మాట్లేడే సమయంలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ కొత్త ఇయర్ బడ్స్‌లో AI ఆధారిత టెక్నాలజీతో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండనుంది. దీంతో ట్రాఫిక్ లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫోన్లు మాట్లాడుకోవచ్చు. ఇక రియల్‌మీ బడ్స్ క్లిప్ ఇయర్ బడ్స్‌ ఏఐ ట్రాన్సలేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంది. ఇది వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

36 గంటల బ్యాటరీ లైఫ్..

Advertisement

ఇక ఈ ఇయర్ బడ్స్‌ బ్యాటరీ పరంగా హైలెట్ అనే చెప్పాలి. ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ పెట్టాక సుమారు 7 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఇక ఛార్జింగ్ కేస్‌తో జత చేసినప్పుడు వినియోగ సమయం 36 గంటల వరకు చేరుకుంటుందని కంపెనీ స్పష్టం చేసింది. దీంతోపాటు బడ్స్‌లోని ఛార్జింగ్ పరిస్థితిని తెలుసుకునేందుకు దీనిలో రింగ్ స్ట్రైల్ ఎల్‌ఈడీ సిగ్నల్ కూడా ఉంటుందట. ఈ ఇయర్ బడ్‌లు IP55 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. దీని వల్ల దుమ్ము, నీటి నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

Read Also: ఐఫోన్ ఎయిర్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఏకంగా రూ.65వేలు తగ్గింపు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×