E-Paper
Advertisement

Realme 16 Pro+ 5G: కెమెరా నుంచి పెర్ఫార్మెన్స్ వరకూ భారీ అప్‌గ్రేడ్స్.. Realme 16 Pro+ 5G స్పెసిఫికేషన్లు లీక్!

Realme 16 Pro+ 5G: కెమెరా నుంచి పెర్ఫార్మెన్స్ వరకూ భారీ అప్‌గ్రేడ్స్.. Realme 16 Pro+ 5G స్పెసిఫికేషన్లు లీక్!
Advertisement

Realme 16 Pro+ 5G: ఇప్పటికే మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న రియల్‌మీ.. మరోసారి మార్కెట్‌లో హీట్ పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే లీక్ అయిన సమాచారం ప్రకారం.. రియల్‌మీ 16 ప్రో ప్లస్ 5జీ ఫోన్ కేవలం చిన్న అప్‌డేట్స్‌కే పరిమితం కాకుండా ప్రీమియం ఫీల్ ఇచ్చే పెద్ద అప్‌గ్రేడ్లతో రానుందని స్పష్టంగా తెలుస్తోంది. డిజైన్ నుంచి పెర్ఫార్మెన్స్ వరకు.. ఈ కొత్త మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్‌ ఏ స్థాయిలో ఉండబోతోందో తెలుసుకోవాలంటే దాని స్పెసిఫికేషన్ల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

మూడు షేడ్స్‌లో అందుబాటులోకి:

ఈ ఫోన్ భారత మార్కెట్లో నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రావచ్చు. 8GB RAMతో 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లతో పాటు 12GB RAMతో 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. కలర్ ఆప్షన్ల విషయంలోనూ.. రియల్‌మీ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కామోల్లియా పింక్, మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే అనే మూడు షేడ్స్‌లో ఈ డివైస్ లాంచ్ కావచ్చని లీక్స్ చెబుతున్నాయి. మార్కెట్లోకి ఇది RMX5131 మోడల్ నంబర్‌తో రావచ్చని టెక్ నిపుణులు అంచనా.

Advertisement

Also Read: ఎలక్ట్రిక్ వైలెట్‌ కలర్‌లో సరికొత్త వన్‌ప్లస్ 15R Ace.. డిజైన్, ఫీచర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది!

అతిపెద్ద కెమెరా అప్‌గ్రేడ్:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో హైలైట్‌గా నిలిచేది కెమెరానే. లీక్‌ల ప్రకారం.. రియల్‌మీ 16 ప్రో ప్లస్ 5జీలో భారీ 200MP ప్రధాన వెనుక కెమెరా ఇవ్వనున్నారు. ఇప్పటివరకు రియల్‌మీ Pro+ సిరీస్‌లో ఇలాంటి సెన్సార్ కనిపించలేదు. అందుకే.. ఇది బ్రాండ్ నుంచి వచ్చిన అతిపెద్ద కెమెరా అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. ముందు భాగంలో కూడా శక్తివంతమైన 50MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉందని సమాచారం.

స్మూత్ ఎక్స్‌పీరియన్స్:

Advertisement

ఇక డిస్‌ప్లే విషయంలోనూ ఈ ఫోన్ నిరాశపరచదని తెలుస్తోంది. 6.78 అంగుళాల OLED స్క్రీన్‌తో పాటు 1.5K రిజల్యూషన్, 144Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండొచ్చని లీక్స్ సూచిస్తున్నాయి. గేమింగ్, స్క్రోలింగ్, వీడియో వ్యూయింగ్‌లో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ సెటప్ ఉంటుందని అంచనా.

చార్జింగ్ స్పీడ్ మెరుగ్గా:

ఈ హ్యాండ్ సెట్ బ్యాటరీ విభాగంలో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. Realme 16 Pro+ 5G లో 7,000mAh భారీ బ్యాటరీ లైఫ్‌తో రానుందని సమాచారం. ఇది గతంలో రియల్‌మీ 14 ప్రో ప్లస్ 5జీలో ఉన్న 6,000mAh బ్యాటరీతో పోలిస్తే స్పష్టమైన అప్‌గ్రేడ్. అయితే.. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, Pro+ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుంటే చార్జింగ్ స్పీడ్ కూడా మెరుగ్గా ఉండవచ్చు.

త్వరలో విడుదల తేదీ:

మొత్తంగా చూసుకుంటే.. రియల్‌మీ 14 ప్రో ప్లస్ 5Gతో పోలిస్తే ఈ కొత్త మోడల్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్, కెమెరా రిజల్యూషన్, బ్యాటరీ సామర్థ్యం వంటి కీలక అంశాల్లో పెద్దమెట్టు ఎక్కినట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, వరుస లీక్స్‌, కొత్త సిరీస్‌కు సంబంధించిన టీజర్లు చూస్తే Realme 16 సిరీస్‌ను త్వరలో మార్కెట్లో దించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: 7100mAh బ్యాటరీ, AI ఇమేజింగ్.. హానర్ మ్యాజిక్ 8 ప్రో లాంచ్ హైలైట్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×