E-Paper
Advertisement

Realme 16 Pro Plus Smartphone: ప్రీమియం ఫీచర్లతో రియల్‌మీ న్యూ ఫోన్.. 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా హైలైట్స్!

Realme 16 Pro Plus Smartphone: ప్రీమియం ఫీచర్లతో రియల్‌మీ న్యూ ఫోన్.. 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా హైలైట్స్!
Advertisement

Realme 16 Pro Plus Smartphone: రియల్‌మి 16 ప్రో సిరీస్‌ను వచ్చే నెలలో భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు రియల్‌‌మీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ‘టెనా’ లో రియల్‌మీ 16 ప్రో ప్లస్ మోడల్ లిస్టింగ్ కనిపించింది.

గిజ్మో చైనా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల భారీ అమోల్‌ఎడ్ డిస్‌ప్లే అందించనున్నారు. ఇప్పటికే లీక్ అయిన వివరాలతో ఈ ఫోన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో లాంచ్ కానున్న ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రీమియం డిజైన్‌తో:

Advertisement

రియల్‌మి 16 ప్రో ప్లస్‌లో పెద్ద సైజ్ AMOLED డిస్‌ప్లేను అందించనున్నారు. హై రిజల్యూషన్‌తో వచ్చే ఈ స్క్రీన్ వల్ల వీడియోలు తీయడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రీమియం డిజైన్‌తో ఈ ఫోన్ యూత్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ ఫీల్ కోరుకునే యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Also Read: ప్రీమియం మార్కెట్‌ను కుదిపేయనున్న వన్‌ప్లస్ 15R.. విడుదలకు ముందే ధర, ఫీచర్స్ లీక్!

కెమెరా ఫీచర్స్:

Advertisement

ఈ ఫోన్‌కు కెమెరా విభాగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వెనుక భాగంలో 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP 3.5x టెలిఫొటో లెన్స్‌ను అందించనున్నారు. దీని ద్వారా ఫొటోగ్రఫీతో పాటు వీడియో రికార్డింగ్‌లో కూడా హై క్వాలిటీ అవుట్‌పుట్ లభించనుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది.

నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్:

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. రియల్‌మి 16 ప్రో ప్లస్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పని చేయనుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7 పై రన్ అవుతుంది. రియల్‌మి ఈ డివైస్‌కు మూడు ప్రధాన ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తో పాటు నాలుగు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనుంది. దీంతో దీర్ఘకాలం పాటు మంచి సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లభిస్తుంది.

బ్యాటరీ, అదనపు ఫీచర్స్:

టీనా లిస్టింగ్ ప్రకారం..Realme 16 Pro Plusలో భారీ 6850mAh బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా, IR బ్లాస్టర్ ఫీచర్ కూడా ఉండటం వల్ల ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌గా ఉపయోగించవచ్చు.

భారత్‌లో విడుదల ఎప్పుడు?

Realme 16 Pro Plus స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో వచ్చే(2026) జనవరి లో లాంచ్ చేయనున్నారు. ప్రో వేరియంట్ ధర సుమారుగా రూ.35,000గా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రో ప్లస్ వేరియంట్ కూడా దాదాపు అదే ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: ఇక గ్యాలరీతో పని లేదు.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్‌గా వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×