E-Paper
Advertisement

Realme 16 5G: 200MP కెమెరాతో రియల్‌మీ 16 ప్రో ఎంట్రీ.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ తప్పదేమో!

Realme 16 5G: 200MP కెమెరాతో రియల్‌మీ 16 ప్రో ఎంట్రీ.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ తప్పదేమో!
Advertisement

Realme 16 5G: హై క్వాలిటీ ఫొటోలు అందించే కెమెరా ఫోన్ కావాలనుకుంటున్న వినియోగదారులను ఆకర్షించేలా ఏకంగా 200MP కెమెరాతో సరికొత్త ‘రియల్‌మీ 16’ సిరీస్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఏదొక కొత్తదనంతో మెప్పించే రియల్‌మీ.. ఈసారి వియత్నాంలో Realme 16 5G, Realme 16 Pro 5G మోడళ్లను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. సూపర్ డిజైన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గేమర్లు, కెమెరా లవర్స్ కోసమే ఈ ఫోన్లను రూపొందించినట్లు తెలుస్తోంది.

రియల్‌మీ 16 5G ఫీచర్లు:

Realme 16 5G ఫోన్.. ఎయిర్ డిజైన్ బాడీ, ఫ్లాట్ ఫ్రేమ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. వెనుక ఉన్న అరోరా వింగ్స్ ఫినిషింగ్ ఫోన్‌కు మంచి లుక్ తెచ్చింది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక 50MP సోనీ మెయిన్ కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం అయితే ఏకంగా 50MP కెమెరా ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ 6.57 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

Advertisement

Also Read: మీ వంటగదికి రాయల్ లుక్.. హయ్యర్ లూమియర్ 4 డోర్ ఫ్రిజ్ అదిరిపోయే ఫీచర్స్ ఇవే!

భారీ బ్యాటరీ సామర్థ్యం..

ఇక పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్ వాడారు. ఇది 8GB/12GB RAM వేరియంట్లలో లభిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16పై ఇది పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. దీనికి తోడు 60W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఫోన్ హీట్ అవ్వకుండా స్పెషల్ కూలింగ్ సిస్టమ్, నీరు, ధూళి తగలకుండా IP69K రేటింగ్ కూడా ఇచ్చేసారు.

రియల్‌మీ 16 ప్రో 5G ఫీచర్లు:

Advertisement

Realme 16 Pro 5G మోడల్ విషయానికి వస్తే.. దీనిలో 6.78 అంగుళాల స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటమే కాదు.. ఏకంగా 6500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. దీంతో ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. గేమింగ్ ఇష్టపడే వారి కోసం డైమెన్సిటీ 7300 మ్యాక్స్ చిప్‌సెట్ అమర్చారు. ఇకపోతే.. ఫొటోగ్రఫీ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ల కోసం దీనిలో ఏకంగా 200MP మెయిన్ కెమెరాను అమర్చారు. 7000mAh భారీ బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ధరల వివరాలు:

వియత్నాంలో రియల్‌మీ 16 ప్రో ప్రారంభ ధర దాదాపు రూ.50 వేల వరకు ఉంది. స్టాండర్డ్ మోడల్ 16 5జీ ధర దాదాపు రూ.40 వేల వరకు ఉండొచ్చు. ఇవి పర్పుల్, గ్రే, వైట్, బ్లాక్ వంటి డిఫరెంట్ కలర్స్ లో దొరుకుతాయి. త్వరలోనే భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ 5G ఫోన్ కావాలా? రూ.15,499కే 7000mAh బ్యాటరీతో రియల్‌మీ నార్జో 90 ఉందిగా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×