E-Paper
Advertisement

Prostate Cancer : మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌.. సర్జరీ లేకుండానే చికిత్స..

Prostate Cancer : మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌.. సర్జరీ లేకుండానే చికిత్స..
Advertisement
Prostate Cancer

Prostate Cancer : టెక్నాలజీ ఎంత పెరిగిన కొన్ని వైద్య సమస్యల నుండి పూర్తిగా పేషెంట్లను బయటపడేసే మార్గం మాత్రం దొరకడం లేదు. ఒకవేళ దొరికినా.. అది అందరి శరీరాలకు ఒకేవిధంగా పనిచేస్తుందని నమ్మకం ఉండడం లేదు. అందుకే పేషెంట్లందరికీ సమానంగా పనిచేసే చికిత్స మార్గాలను వైద్యులు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో కూడా అలాంటి ఒక విధానాన్నే వారు కనుక్కున్నట్టు తెలుస్తోంది.

క్యాన్సర్‌కు పలు చికిత్స మార్గాలు ఉంటాయి. అందులో సర్జరీ కూడా ఒకటి. అయితే సర్జరీ, రేడియేషన్‌కు సమానంగా ఉండే ప్రత్యామ్నాయం మాత్రం ఇప్పటివరకు దొరకలేదు. తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ సర్జరీకి ఒక ప్రత్యామ్నాయం దొరికిందని వైద్యులు చెప్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించిన వెంటనే దానికి అప్పటికప్పుడు సర్జరీ కానీ, రేడియేషన్ కానీ చేయకుండా కొన్నిరోజులు మానిటర్ చేయడం వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయని వారు గమనించారు.

Advertisement

ఈ ప్రోస్టేట్ క్యాన్సర్‌ను పౌరుష గ్రంధి క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది మగవారిలో కనిపిస్తుంటుంది. అయితే దీనికి సర్జరీతో చికిత్స ఉన్నా.. దాని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అనేక సెక్సువల్ సమస్యలకు ఇది దారితీసే అవకాశం ఉంది. అందుకే దీనికి వెంటనే సర్జరీ చేయకుండా అబ్జర్వేషన్ మేలు అని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రోస్టేట్ సర్జరీ కోసం మూడు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవి ట్యూమర్లను తొలగించడం, రేడియోషన్ ట్రీట్మెంట్, మానిటరింగ్. ఈ మూడింటిలో మానిటరింగ్ బెటర్ అని పరిశోధకులు నిర్ధారించారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది వెంటనే బయటపడేది కాదు. ఇది ఫార్మ్ అనేది ఎన్నో ఏళ్ల తర్వాత లక్షణాలు బయటికి కనిపించడం మొదలుపెడతాయి. ఈ సమస్య ఎదురయిన వారిలో 97 శాతం మందికి సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా జరుగిందని సర్వేలో తేలింది. అందుకే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించిన మగవారు భయపడి ట్రీట్మెంట్ విషయంలో తొందరపడకూడదని సలహా ఇస్తున్నారు. ఈ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ మంచిదని వారు తెలిపారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×