E-Paper
Advertisement

ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్ సిమ్.. రెండింటికి తేడా ఏంటి? సామాన్యులకు ఏది బెస్ట్?

ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్ సిమ్.. రెండింటికి తేడా ఏంటి? సామాన్యులకు ఏది బెస్ట్?
Advertisement

Prepaid vs Postpaid SIM: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేనిదే పూట గడవని పరిస్థితి ఉంటోంది. అయితే చేతిలో ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరినీ ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ప్రీపెయిడ్ సిమ్ తీసుకోవాలా? లేదంటే పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు మార్చుకోవాలా? అని దాదాపు 90 శాతం మంది మెుబైల్ యూజర్లు తెగ సందేహిస్తుంటారు. అయితే చూడటానికి పైకి ఈ రెండు ఒకేలా కనిపించినా.. ఖర్చులు, బెనిఫిట్స్ విషయంలో రెండింటికి చాలా తేడాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవి ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రీపెయిడ్ సేవలు

ముందే డబ్బులు కట్టి.. ఆ తర్వాత సేవలు పొందే ప్రక్రియను ప్రీపెయిడ్ అంటారు. దేశంలో అత్యధికమంది స్మార్ట్ ఫోన్ యూజర్లు.. ప్రీపెయిడ్ సేవలను వినియోగిస్తున్నారు. బడ్జెట్ దాటిపోకుండా.. అదనపు చెల్లింపులు ఉండకూడదని భావించే వారికి ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ విభాగంలో అనేక రకాల ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు లేదా ఏడాది పొడుగునా.. డజన్ల కొద్ది ప్లాన్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అవసరానికి అనుగుణంగా ఉన్న ప్లాన్ ను ఎంచుకునే వెసులుబాటు యూజర్లకు ఉంటుంది. విద్యార్థులు, బడ్జెట్ పరిమితులు ఉన్నవారు, మెుబైల్ వాడకం తక్కువగా ఉండేవారికి ప్రీపెయిడ్ ప్లాన్స్ సరిగ్గా సరిపోతాయి.

పోస్ట్‌పెయిడ్ సర్వీసు

Advertisement

టెలికాం సేవల్ని ముందుగానే పొంది.. నెల చివర్లో బిల్లు కట్టే విధానాన్ని పోస్ట్ పెయిడ్ అంటారు. ఇది ప్రీపెయిడ్ తో పోలిస్తే.. కాస్త ఖరీదైనదిగా చెప్పవచ్చు. అయితే బెనిఫిట్స్ పరంగా ఇది నెక్ట్ లెవల్లో ఉంటుంది. ఒకసారి పోస్ట్ పెయిడ్ లోకి ప్రవేశిస్తే.. డేటా అయిపోతుందనే భయం ఉండదు. ఈ నెలలో డేటా మిగిలిపోతే.. అది వచ్చే నెలకు యాడ్ అవుతుంది (డేటా రోల్‌ఓవర్). నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రీమియం యాప్స్ సబ్‌స్క్రిప్షన్లు చాలా పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఉచితంగా లభిస్తాయి. ఒకే బిల్లుపై ఇంట్లో నలుగురు లేదా ఐదుగురు కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు పోస్ట్ పెయిడ్ లో ఉంటుంది. మధ్యలో ప్లాన్ అయిపోవడం, కాల్స్ కట్ అవ్వడం లాంటి సమస్యలేవి ఇందులో ఉండవు. వ్యాపారులు, ఆఫీసు వర్క్ కోసం ఎక్కువ డేటా అవసరమున్న వారికి పోస్ట్ పెయిడ్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఓటీటీ కంటెంట్ కోరుకునేవారికి సైతం ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: BSNL కస్టమర్లకు షాక్.. రూ. 107 ప్లాన్ వ్యాలిడిటీ మళ్లీ కట్!

ఫైనల్గా ఏది బెస్ట్?

Advertisement

యూజర్ల తొలి ప్రాధాన్యత.. డబ్బు ఆదా చేయడమే అయితే.. కళ్లుమూసుకొని ప్రీపెయిడ్ లోనే కొనసాగడం మంచిది. అలా కాకుండా ప్రతీసారి రీఛార్జ్ చేసుకునే పని ఉండకూడదని, ఫ్రీగా మల్టీపుల్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు కోరుకుంటే మాత్రం.. పోస్ట్ పెయిడ్ చాలా బాగుంటుంది. అయితే ఫైనల్గా చెప్పాలంటే టెలికాం నిపుణుల ప్రకారం.. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పోస్ట్ పెయిడ్ వైపు మెుగ్గు చూపడమే మంచిది. దీని ద్వారా నిరంతరాయంగా ఎలాంటి పరిమితులు లేకుండా డేటా, ఓటీటీ కంటెంట్, కాల్స్ పొందవచ్చు.

Also Read: ఉక్కపోతతో నిద్ర పట్టట్లేదా? ఏసీ ఉన్నా, లేకున్నా.. ఈ ట్రిక్స్‌తో హాయిగా పడుకోవచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×