E-Paper
Advertisement

పోర్ట్రోనిక్స్ డాష్ 4 పార్టీ స్పీకర్.. తక్కువ ధరలో అద్భుతమైన సౌండ్!

పోర్ట్రోనిక్స్ డాష్ 4 పార్టీ స్పీకర్.. తక్కువ ధరలో అద్భుతమైన సౌండ్!
Advertisement

Portronics Dash 4 party speaker: మ్యూజిక్ లేకుండా ఏ పార్టీ అయినా కళ తప్పినట్టే కదా! మీ ఇంట్లో.. జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకి లేదా ఫ్రెండ్స్‌తో కలిసి చేసే సెలబ్రేషన్స్‌కి అదిరిపోయే సౌండ్ ఇచ్చే స్పీకర్ కోసం వెతుకుతున్నారా? అయితే.. ప్రముఖ గ్యాడ్జెట్ బ్రాండ్ పోర్ట్రోనిక్స్ మార్కెట్లోకి తీసుకొచ్చిన Portronics Dash 4 50W Wireless Bluetooth Party Speaker మీకు బెస్ట్. కేవలం రూ. 6,299 ధరలో లభిస్తున్న ఈ స్పీకర్, స్టైలిష్ లుక్ తో పాటు అద్భుతమైన బేస్‌ని అందిస్తుంది. దీని పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ఫీచర్లు:

డిజైన్ ,లుక్ :
ఈ స్పీకర్ డిజైన్ చూస్తేనే మ్యూజిక్ లవర్స్‌కి ఫిదా అయిపోతారు. ఇది చాలా మోడ్రన్, స్టైలిష్ , కాంపాక్ట్ లుక్‌లో వస్తుంది. దీనిని ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్లవచ్చు . పార్టీ మూడ్‌ని మరింత పెంచడానికి ఇందులో.. అట్రాక్టివ్ RGB లైటింగ్ ఇచ్చారు. మీరు ఆడే పాటల బీట్స్ కి తగ్గట్టుగా ఈ లైట్స్ మారుతూ ఉంటాయి. ఇది పార్టీకి సరి కొత్త వైబ్ ఇస్తుంది.

Advertisement

పవర్ ఫుల్ సౌండ్ & పెర్ఫార్మెన్స్:
ఈ స్పీకర్ అసలు సిసలు హైలైట్ దీని సౌండ్ క్వాలిటీ. ఇది ఏకంగా 50 వాట్స్ పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. అంటే చిన్నపాటి గది నుంచి టెర్రస్ పార్టీల వరకు ప్రతి మూలా సౌండ్ దద్దరిల్లిపోతుంది. ఇందులో వచ్చే బేస్ చాలా క్లియర్ గా , డీప్‌గా ఉంటుంది. మీరు బీట్ సాంగ్స్ ఇష్టపడే వారైతే, దీని ఆడియో ఎక్స్‌పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్ :
ఈ రోజుల్లో అందరూ వైర్‌లెస్ కనెక్టివిటీనే కోరుకుంటున్నారు. పోర్ట్రోనిక్స్ డాష్ 4 తాజా బ్లూటూత్ టెక్నాలజీతో .. వస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ లేదా లాప్‌టాప్‌ని క్షణాల్లో.. కనెక్ట్ చేసుకోవచ్చు. కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా.. యూఎస్‌బీ డ్రైవ్, ఆక్స్ కేబుల్ , ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాదు.. మీ ఫ్రెండ్స్ తో కలిసి పాటలు పాడటానికి ఇందులో మైక్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది.

Advertisement

Also Read: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 పవర్ బ్యాంక్స్..మీ ఫోన్‌కు ఏది బెస్ట్?

బ్యాటరీ బ్యాకప్:
పార్టీ మధ్యలో స్పీకర్ ఆగిపోతే.. ఆ మజాయే పోతుంది. ఈ సమస్య రాకుండా పోర్ట్రోనిక్స్ ఇందులో.. పవర్ ఫుల్ రీఛార్జబుల్ బ్యాటరీని అమర్చింది. ఒక్కసారి. ఫుల్ ఛార్జ్ చేస్తే, ఇది గంటల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్‌ని అందిస్తుంది. పార్టీలు, క్యాంప్‌ఫైర్లు , అవుట్‌డోర్ ట్రిప్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ధర :
అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కలిగిన ఈ స్పీకర్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 6,299 మాత్రమే. బడ్జెట్ ధరలో ఎక్కువ పవర్, బెస్ట్ డిజైన్ కోరుకునే వారికి.. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆప్షన్లలో ఒకటి. మీరు ఈ గ్యాడ్జెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా పోర్ట్రోనిక్స్ అధికారిక సైట్ ద్వారా కూడా కొనొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×