E-Paper
Advertisement

POCO X8 Pro Series Sale: ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X8 ప్రో సిరీస్ సేల్ షురూ.. ఈ క్రేజీ ఫీచర్లు, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి!

POCO X8 Pro Series Sale: ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X8 ప్రో సిరీస్ సేల్ షురూ.. ఈ క్రేజీ ఫీచర్లు, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి!
Advertisement

POCO X8 Pro Series Sale: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న POCO X8 Pro సిరీస్ భారత్‌లో అమ్మకానికి సిద్ధమైంది. గత వారమే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ ఫోన్లు.. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ వేదికగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా గేమింగ్, పెర్ఫార్మెన్స్‌ను ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని పోకో ఈ ఫోన్లను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో POCO X8 Pro, POCO X8 Pro Max అనే రెండు మోడళ్లు ఉన్నాయి.

ధర వివరాలు ఇలా..

ఈ POCO X8 Pro బేస్ వేరియంట్ 8GB/256GB ధర రూ.32,999గా ఉండగా, 12GB/256GB మోడల్ రూ.35,999కి లభిస్తుంది. ప్రత్యేకంగా ఐరన్ మ్యాన్ ఎడిషన్‌ను ఇష్టపడే వారి కోసం రూ.37,999 ధరకు ఒక స్పెషల్ వేరియంట్‌ను కూడా తీసుకొచ్చారు. ఇక ప్రీమియం మోడల్ అయిన POCO X8 Pro Max విషయానికి వస్తే.. దీని 12GB/256GB వేరియంట్ ధర రూ.42,999 కాగా, హైఎండ్ మోడల్ 12GB/512GB రూ.46,999కి అందుబాటులో ఉంది. HDFC, ICICI, SBI కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

Advertisement

Also Read: కరెంట్ అక్కర్లేదు, వై-ఫై వద్దు.. సిమ్ కార్డుతో పనిచేసే ఈ సోలార్ కెమెరా గురించి తెలుసా?

పోకో X8 ప్రో మాక్స్ ప్రత్యేకతలు..

ఈ ఫోన్లో 6.83 అంగుళాల భారీ 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో వాడిన మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్ ఫోన్ స్పీడ్‌ను అద్భుతంగా పెంచుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా దీనిలో 9,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందించారు.

పోకో X8 ప్రో ఫీచర్లు..

Advertisement

ఈ ఫోన్ 6.59 అంగుళాల డిస్‌ప్లేతో కొంచెం కాంపాక్ట్‌గా ఉంటుంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6,500mAh బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. రెండు ఫోన్లలోనూ హీట్‌ను తగ్గించడానికి ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. తద్వారా గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ త్వరగా వేడెక్కదు.

కెమెరా సామర్థ్యం ఇది..

ఫొటోగ్రఫీ కోసం రెండు ఫోన్లలోనూ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. వీటి ద్వారా 4K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. మొత్తం మీద మంచి పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ ఫోన్లు నచ్చుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: యాపిల్ హిస్టరీలోనే రికార్డ్ సేల్స్.. ‘మ్యాక్‌బుక్ నియో’కు ఎందుకంత క్రేజ్?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×