E-Paper
Advertisement

Poco X8 Pro Iron Man Edition: మార్కెట్లోకి Poco X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Poco X8 Pro Iron Man Edition: మార్కెట్లోకి Poco X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Advertisement

Poco X8 Pro Iron Man Edition: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ POCO నుంచి త్వరలో అదిరిపోయే ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. మార్వెల్ సూపర్ హీరో ‘ఐరన్ మ్యాన్’ అంటే పడిచచ్చే మొబైల్ ప్రియుల కోసం పోకో ఒక స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తోంది. త్వరలో మార్కెట్లోకి రాబోతున్నPoco X8 Pro సిరీస్‌లో భాగంగా ఒక ప్రత్యేకమైన ఐరన్ మ్యాన్ ఎడిషన్‌ను సంస్థ తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ ఫోన్ రకరకాల ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్లను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

యూజర్లలో పెరిగిన ఆసక్తి..

Poco X8 Pro ఇప్పటికే యూరప్, ఇండియా, ఇండోనేషియా వంటి దేశాల్లో సర్టిఫికేషన్లు పూర్తి చేసుకోగా.. తాజాగా థాయ్‌లాండ్‌కు చెందిన NBTC వెబ్‌సైట్‌లోనూ దర్శనమిచ్చింది. అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇది కేవలం సాధారణ మోడల్ మాత్రమే కాదు, Poco X8 Pro Iron Man Edition పేరుతో రిజిస్టరైంది. గతంలో వచ్చిన Poco X7 Pro కూడా ఇదే థీమ్‌తో అలరించగా, ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మార్వెల్‌తో తన భాగస్వామ్యాన్ని పోకో మరోసారి కొనసాగిస్తోంది.

Advertisement

Also Read: స్మార్ట్ టీవీ కొనక్కర్లేదు.. కేవలం రూ.3,600కే మీ బెడ్‌రూమ్ సినిమా హాల్ అయిపోతుంది!

మార్కెట్లోకి ఎప్పుడంటే?

సాధారణంగా పోకో తన ఫోన్లను ప్రతి ఏటా ఒకే సమయంలో లాంచ్ చేస్తూ వస్తోంది. 2025 జనవరిలోనే X7 Pro విడుదలైంది. ప్రస్తుతం జనవరి నెల నడుస్తుండటం.. ఈ లోపే చాలా దేశాల్లో సర్టిఫికేషన్లు పూర్తయిపోవడంతో, ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల ప్రారంభంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. చైనాలో రిలీజ్ కాబోతున్న Redmi Turbo 5కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ వస్తోందని టెక్ నిపుణుల అంచనా.

స్పెసిఫికేషన్లు..

Advertisement

డిజైన్ పరంగా ఐరన్ మ్యాన్ ఎడిషన్ చాలా స్టైలిష్‌గా, రెడ్, గోల్డెన్ రంగుల కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ లుక్ ఇవ్వనుంది. అలాగే రెండు మోడళ్లలోనూ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ X8 Proలో MediaTek Dimensity 8500 చిప్‌సెట్ ఉండగా.. X8 Pro Max వేరియంట్‌లో మరింత శక్తివంతమైన Dimensity 9500 ప్రాసెసర్‌ను వాడారని సమాచారం. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో రానున్నట్లు లీకులు చెబుతున్నాయి.

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల బ్యాటరీ.. ఏసర్ నుంచి రెండు అదిరిపోయే క్రోమ్‌బుక్స్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×