E-Paper
Advertisement

POCO X7 Pro 5G : పోకో X7 ప్రో ఫస్ట్ సేల్ ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

POCO X7 Pro 5G : పోకో X7 ప్రో ఫస్ట్ సేల్ ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!
Advertisement

POCO X7 Pro 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో (POCO) తాజాగా POCO X7 సిరీస్ ను లాంఛ్ చేసింది. ఇందులో రెండు బెస్ట్ మిడ్ రేంజ్ మెుబైల్స్ ను తీసుకొచ్చింది. ఇక ఈ రోజు ఈ మెుబైల్స్ ఫస్ట్ సేల్ మెుదలైంది. మరి ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

POCO జనవరి 9న POCO X7 5G, POCO X7 Pro 5G పేరుతో రెండు మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 8400 చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే తో పాటు మరెన్నో ఫీచర్స్ తో వచ్చేశాయి. ఇక ఈ రోజు POCO X7 Pro 5G ఫస్ట్ సేల్ మెుదలైంది. ఫ్లిప్కార్ట్ వేదికగా మొదలైన ఈ ఫస్ట్ సెల్ లో భారీ ఆఫర్స్ ను అందిస్తుంది పోకో. ఈ మొబైల్ పై డిస్కౌంట్స్ తో పాటు ఇన్స్టెంట్ తగ్గింపును సైతం అందిస్తోంది.

Advertisement

POCO X7 Pro 5G మెుబైల్ 8GB+256GB వేరియంట్ ధర రూ.27,999, 12GB+256GB వేరియంట్ ధర రూ.29,999కే అందుబాటులో ఉంది. ఇది ఎల్లో, నెబ్యులా గ్రీన్, అబ్సిడియన్ బ్లాక్‌తో సహా మూడు రంగులలో అందుబాటులో ఉంది.

ఇక ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్స్ ను ప్రకటించడంతో అయితే POCO X7 5G 8GB+128GBకి రూ. 21,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.23,999కి అందుబాటులో ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 2000 తగ్గింపును పొందవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ తన క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1250 తగ్గింపును కూడా అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌పై కస్టమర్లు 9 నెలల వరకు నో-కాస్ట్ EMI, రూ. 2000 తగ్గింపును కూడా పొందవచ్చు.

Advertisement

POCO X7 5G సిరీస్ స్పెసిఫికేషన్‌లు –

POCO X7 5G, POCO X7 Pro 5G వరుసగా డైమెన్సిటీ 7300, డైమెస్నిటీ 8400 చిప్‌సెట్ తో పనిచేస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది. POCO X7 ప్రో గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొటెక్ట్ అవుతుంది. అయితే X7 గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో పనిచేస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. POCO X7 Pro 5G 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది. అయితే POCO X7 5G మెుబైల్.. 2MP+50MP+8MPతో సహా ట్రిపుల్ కెమెరా సెన్సార్‌లతో వస్తుంది. సెల్ఫీల కోసం, POCO X7 5G 20MP ఫ్రంట్ కెమెరాతో అమర్చబడింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ బ్యాటరీ విషయానికి వస్తే.. POCO X7 5Gలో 5110mAh బ్యాటరీ, POCO X7 Pro 5Gలో 6550mAh బ్యాటరీ ఉన్నాయి . సో.. పోకో X7 సిరీస్ ఫీచర్స్ తో ధర సైతం అదిరేలా ఉంది. బెస్ట్ మిడ్ రేంజ్ మెుబైల్ కొనాలనుకుంటే తప్పుకుండా ట్రై చేయండి.

ALSO READ : ఊరిస్తున్న యాపిల్ ఫ్లిప్ మెుబైల్ ఫీచర్స్.. లాంఛ్ ఎప్పుడంటే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×