E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ టాబ్లెట్.. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన Poco Pad C1 ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!

తక్కువ ధరలో బెస్ట్ టాబ్లెట్.. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన Poco Pad C1 ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!
Advertisement

Poco Pad C1: ప్రముఖ టెక్ బ్రాండ్ పోకో మార్కెట్లోకి సరికొత్త టాబ్లెట్‌ను తీసుకొచ్చింది. Poco Pad C1 పేరుతో దీన్ని అధికారికంగా కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేశారు. మెటల్ యూనిబాడీ డిజైన్‌తో చూసేందుకు ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియంగా కనిపించే ఈ టాబ్లెట్.. రోజువారీ ఆఫీస్ అవసరాలకు, వినోదానికి బాగా సెట్ అవుతుంది. ఇది బ్లూ, గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

ఈ టాబ్లెట్‌లో 9.7 అంగుళాల 2K డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది కాబట్టి స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. ఎక్కువ సమయం చూసినా కంటికి అలసట రాకుండా ప్రత్యేక సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. అలాగే దీనిలో స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 2 ప్రాసెసర్‌ను వాడారు. ఇది మల్టీటాస్కింగ్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది. ఈ పాడ్ 6GB వరకు RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. అవసరమైతే మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.

Advertisement

Also Read: వామ్మో.. రూ.63 వేలా? సోనీ కొత్త యానివర్సరీ హెడ్‌ఫోన్స్‌లో అంత స్పెషల్ ఏముందో?

ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమి హైపర్‌ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్‌తో ఈ టాబ్లెట్ పనిచేస్తుంది. అలాగే ఇందులో గూగుల్ సర్కిల్ టు సెర్చ్ లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. షావోమి ఫోన్లతో దీన్ని ఈజీగా కనెక్ట్ చేసి కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఫైల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 8MP, సెల్ఫీల కోసం ముందు వైపు 5MP కెమెరాలు ఉన్నాయి. వీటితో చక్కటి వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు.

Advertisement

ఈ Poco Pad C1లో భారీ 7,600mAh బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటలకు పైగా ఆన్‌లైన్ వీడియోలు చూసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా.. బాక్స్‌లో 15W ఛార్జర్‌ను ఇస్తున్నారు. మంచి ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం హైరెస్ సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు, హెడ్‌ఫోన్ జాక్ కూడా అందించారు. ఇక సెక్యూరిటీ కోసం దీనిలో ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. అయితే, ఈ టాబ్లెట్ ధర, సేల్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Also Read: యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ యూజర్లకు అదిరిపోయే హెల్త్ ఫీచర్లు.. ఇక ఇంట్లోనే ఆ రెండు టెస్టులు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×