E-Paper
Advertisement

ఏంది భయ్యా ఇది.. Poco నుంచి ఇలాంటి క్రేజీ ఫోన్స్.. కలలో కూడా ఊహించలే!

ఏంది భయ్యా ఇది.. Poco నుంచి ఇలాంటి క్రేజీ ఫోన్స్.. కలలో కూడా ఊహించలే!
Advertisement

Poco Budget Phones: రియల్ మీ, ఒప్పో, వన్ ప్లస్, వివో తదితర ఫోన్లతో పోలిస్తే మార్కెట్ పరంగా పోకో కాస్త వెనుకబడి ఉందన్న ఫీలింగ్ మెుబైల్ యూజర్లలో ఉంది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎంత మంచి ఫోన్ తీసుకొచ్చినప్పటికీ.. వాటి పోకో రీచింగ్ చాలా పరిమితంగానే ఉంటోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో అధిక శాతంలో ఉన్న మిడిల్ క్లాస్ ప్రజలను ఆకట్టుకునేందుకు పోకో సరికొత్త బడ్జెట్ మెుబైల్స్ ను గురువారం భారత మార్కెట్ లో లాంచ్ చేసింది.

టెక్ నిపుణుల ప్రశంసలు

కొత్తగా తీసుకొచ్చిన Poco C81, Poco C81x స్మార్ట్‌ఫోన్ లు అధునాతన ఫీచర్లతో మెుబైల్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పోకో నుంచి ఇలాంటి అద్భుతమైన బడ్జెట్ ఫోన్ ను గతంలో చూడలేదంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో ప్రీమియం ఫీచర్లతో ఉన్న ఫోన్ కోరుకునేవారు.. పక్కాగా వీటిని ట్రై చేయవచ్చని టెక్ నిపుణులు సైతం సూచిస్తున్నారు.

ఫీచర్ల విషయానికి వస్తే..

Advertisement

పోకో నయా ఫోన్ల ఫీచర్ల విషయానికి వస్తే.. Poco C81 వేరియంట్ 6.9 అంగుళాల భారీ HD+ LCD డిస్‌ప్లేతో వచ్చింది. Poco C81x మోడల్.. 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. రెండు ఫోన్‌లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల స్క్రీన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. మరోవైపు రెండింటిలోనూ Unisoc T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3ను అందించారు.

బ్యాటరీ, కెమెరా సెటప్

బ్యాటరీ విషయానికి వస్తే.. Poco C81లో 6,300mAh భారీ బ్యాటరీని అమర్చారు. Poco C81x వేరియంట్ ను 5,200mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. ఈ రెండూ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 7.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. మరోవైపు కెమెరా విభాగానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్ ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 8MP సెన్సార్ ను అమర్చారు.

Advertisement

Also Read: కొత్త ఏసీ కావాలా? డైకిన్ వెరీ రీజనబుల్ ఏసీలు.. ధర తక్కువ కూలింగ్ ఎక్కువ!

ఇంతకీ ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే పోకో సి81 ఎక్స్ (3GB RAM + 64GB Storage) ధరను రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే Poco C81 (4GB RAM + 64GB Storage) రూ.10,999 అందిస్తోంది. ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో ఈ కొత్త పోకో ఫోన్ల సేల్ మెుదలుకానుంది. ఈ ఫోన్లను ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ, సన్‌సెట్ గోల్డ్ (C81 మాత్రమే) రంగుల్లో పొందవచ్చు.

Also Read: ఏసీ ఆయుష్షు పెంచే.. అద్భుతమైన చిట్కాలు.. లైఫ్‌లో ఇంకోటి కొనే అవసరమే రాదు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×