E-Paper
Advertisement

బుక్ vs ఈ-బుక్.. గెలుపెవరిది? చదవడానికి ఏది బెస్ట్?

బుక్ vs ఈ-బుక్.. గెలుపెవరిది? చదవడానికి ఏది బెస్ట్?
Advertisement

Physical Books vs E-Books: నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కటి డిజిటల్ మయమైపోయింది. ఈ క్రమంలోనే శతాబ్దాల చరిత్ర కలిగిన పుస్తక పఠనంలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం కాగితపు పుస్తకాలకే పరిమితమైన పాఠకులు.. ఇప్పుడు ఈ-బుక్స్ (e-books), ఆడియో బుక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక పుస్తకాలు (Physical Books) బెటరా? లేక ఈ-బుక్స్ (E-books) మేలా? అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఆ సందేహాన్ని ఈ కథనంలో నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం.

భౌతిక పుస్తకాల మజా!

కాగితపు పుస్తకాలను చేతితో పట్టుకుని చదవడం బుక్స్ లవర్స్ కు ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. కొత్త పుస్తకం కొన్నప్పుడు వచ్చే ఆ కాగితాల సువాసన, పేజీలను తిరగేసేటప్పుడు వచ్చే శబ్దం చదువరులకు తెలియని ఉత్సాహాన్ని ఇస్తాయి. పరిశోధనల ప్రకారం.. స్క్రీన్లపై చదవడం కంటే కాగితంపై చదివిన విషయాలు మెదడుకు బాగా గుర్తుంటాయి. రాత్రి వేళల్లో భౌతిక పుస్తకాలు చదవడం వల్ల నిద్రలేమి సమస్యలు ఉండవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ-బుక్స్ విప్లవం!

Advertisement

ప్రస్తుత రోజుల్లో ఈ-బుక్స్ సౌకర్యానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఒక చిన్న కిండ్ల్ (Kindle) లేదా టాబ్లెట్‌లో వేలాది పుస్తకాలను భద్రపరుచుకోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు బరువైన పుస్తకాలను మోసే పని లేకుండా అరచేతిలోనే ఒక పెద్ద లైబ్రరీని మోసుకెళ్లవచ్చు. ఈ-బుక్స్‌లో మనకు నచ్చినట్లు ఫాంట్ సైజును పెంచుకునే తగ్గించుకునే వీలుంటుంది. చీకట్లో కూడా చదువుకునేలా బ్యాక్‌లైట్ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే వెంటనే స్క్రీన్‌పైనే డిక్షనరీ ద్వారా చూసుకునే సదుపాయం ఈ-బుక్స్ కల్పిస్తున్నాయి.

ఖర్చు, పర్యావరణ పరంగా..

పర్యావరణ పరంగా చూస్తే.. ఈ-బుక్స్ కోసం కాగితాన్ని వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి చెట్లను నరకాల్సిన ఇబ్బంది ఉండదు. ఇక ధరల విషయానికి వస్తే.. సాధారణంగా భౌతిక పుస్తకాలతో పోలిస్తే ఈ-బుక్స్ ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. ప్రింటింగ్, పంపిణీ ఖర్చులు ఉండవు కాబట్టి పాఠకులకు తక్కువ ధరకే పుస్తకాలు లభిస్తాయి. దీనివల్ల తక్కువ బడ్జెట్ లో ఎక్కువ బుక్స్ చదివేందుకు వీలు కలుగుతుంది.

Advertisement

Also Read: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎండకు తట్టుకోలేక.. ఐకియాలోనే మకాం పెట్టేశారు!

ఫైనల్గా రెండింట్లో ఏది బెస్ట్?

భౌతిక vs ఈ బుక్స్ ల మధ్య పోటీలో ఏది బెటర్ అన్నది పూర్తిగా పాఠకుడి వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. సాంకేతికతను ఇష్టపడుతూ, ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఈ-బుక్స్ వరం లాంటిదని చెప్పవచ్చు. అలా కాకుండా పుస్తకాన్ని తాకుతూ, నిదానంగా చదవాలనుకునే సాంప్రదాయ పాఠకులకు భౌతిక పుస్తకాలే మంచిది. ఓవరాల్గా చెప్పాలంటే.. అక్షరాన్ని ప్రేమించే వారికి మాధ్యమంతో సంబంధం లేదు. ఏ రూపంలోనైనా పుస్తకాలను చదువుకుంటూ పోవడం ఉత్తమ లక్షణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: ఏఐ క్లీనిక్స్.. డాక్టర్ లేకుండానే సెకన్లలో రోగ నిర్ధరణ, చికిత్స.. మందులు కూడా అవే ఇచ్చేస్తాయ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×